కడపలో సందడి చేసిన శ్రీలీల - 'కుర్చీ మడతపెట్టి' పాటకు స్టెప్పులు - heroine sreeleela in kadapa - HEROINE SREELEELA IN KADAPA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 7:58 PM IST
Actress Sreeleela Opened Kalyan Jewellers shop in kadapa : ప్రముఖ సినీనటి శ్రీల కడపలో సందడి చేశారు. పట్టణంలో ఇదివరకే ఉన్న కళ్యాణ జ్యువెలర్స్ షాపును ఈ మధ్యనే నూతనంగా తీర్చిదిద్దారు. సరికొత్త హంగులతో ఉన్న అప్‌డేటెడ్ షోరూమ్‌ను ప్రారంభించడానికి ఆమె ఈరోజు పట్టణానికి విచ్చేశారు. మధ్యహ్నం 3 గంటలకు షోరూమ్ వద్దకు చేరుకున్న శ్రీలీల రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. షోరూమ్ వద్దకు సినీనటి వస్తుందని తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు తగిన భద్రత ఏర్పాట్లు చేశారు.
కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రారంభం అనంతరం శ్రీ లీల వేదికపై కొచ్చి కాసేపు అభిమానులతో మాట్లాడారు. ఇంత ఎండలో కూడా నామీద అభిమానంతో మీరంత ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా కడపకు వస్తానని తెలిపారు. అనంతరం ప్రేక్షకుల కోరిక మేరకు కూర్చి మడత పెట్టి పాటకు కొద్దిసేపు స్టెప్పులేసి అభిమానులను అలరించారు.