నేరం ఒప్పుకోకపోతే ఏదో ఒకటి చేస్తాం - జైలులో సతీశ్​ను బెదిరిస్తున్నారని తల్లిదండ్రుల ఆందోళన - Accused Satish in jail - ACCUSED SATISH IN JAIL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 5:38 PM IST

Accused Satish Was met by Family Members in Jail : సీఎంపై రాయి ఘటనలో నిందితునిగా ఉన్న సతీశ్​ను ఈరోజు అతని కుటుంబసభ్యులు, న్యాయవాది సలీం జైలులో కలిశారు. అనంతరం న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ, ఏ తప్పుచేయాని సతీశ్​ను కేవలం రాజకీయ లబ్ధికోసమే ఈ కుట్రలో ఇరికించారని తెలిపారు. నేరం ఒప్పుకోకపోతే ఏదో ఒకటి చేస్తామని గన్నుతో పోలీసులు బెదిరిస్తున్నారని జైలులో ఉన్న సతీశ్​ చెబుతున్నాడని వెల్లడించారు. ఎక్కడో చీకట్లోకి తీసుకెళ్లి నేరం ఒప్పుకోమని భయపెడుతున్నారని తెలిపారు. తనకు ఏ పాపం తెలియదని నిందితుడు రోదిస్తున్నాడని వివరించారు.  

అలాగే మరో నిందితునిగా ఉన్న దుర్గారావు కుటుంబానికి పోలీసులు ఫోన్ చేసి డబ్బులు ఇస్తామని మభ్యపెడుతున్నట్లు తెలిపారు. అధేవిధంగా కుటుంబానికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ప్రలోభపెడుతున్నారని వెల్లడించారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రతోనే చేస్తున్నారు. దుర్గారావు ఆచూకీ తెలియజేయాలని రేపు న్యాయస్థానంలో హెబియస్ కార్పస్ పిటీషన్ వేస్తామని న్యాయవాది సలీం వెల్లడించారు. అలాగే సతీశ్ తండ్రి మాట్లాడుతూ, మా అబ్బాయికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. నా కుమారుడిని పోలీసులు భయపెడుతున్నారు. మీ రాజకీయాల కోసం నా కూమారుడిని ఎందుకు బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.