శ్రీకాళహస్తిలో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు- యాలి వాహనంపై దర్శనమిచ్చిన కుమారస్వామి - AadiKrithika Brahmotsavam - AADIKRITHIKA BRAHMOTSAVAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 28, 2024, 2:12 PM IST
AadiKrithika Brahmotsavam at SriKalahasti Temple: ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని శ్రీవల్లీ దేవసేన సమేత కుమారస్వామి యాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అలంకార మండపంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య దూప, దీప నైవేధ్యాలు సమర్పించి దేవతా మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. యాలి వాహనంపై అధిరోహించిన షణ్ముఖుడు పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఐదు రోజులపాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడంతో ఆయన సతీమణి పులివర్తి సుధా రెడ్డి ఇటీవల గోడపత్రిక, కరపత్రాలను ఆవిష్కరించారు. పులివర్తి నాని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిగా వచ్చిన బ్రహ్మోత్సవాలు కావటంతో మునుపటి కన్నా ఈసారి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాని ఇప్పటికే పలుమార్లు ఆలయ అధికారులు, పలు శాఖల అధికారులు, మండల నాయకులతో సమావేశం అయ్యారు. ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.