ETV Bharat / state

పోలవరం డ‌యాఫ్రం వాల్ కాంక్రీట్ నిర్మాణ ప‌నులకు ముహూర్తం ఫిక్స్ - NEW DIAPHRAGM WALL AT POLAVARAM

పోలవరం ప్రాజెక్ట్​లో కొత్త డయాఫ్రంవాల్‌ పనులు -సగం పూర్తయిన వెంటనే దీనిపైన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం

new_diaphragm_wall_at_polavaram
new_diaphragm_wall_at_polavaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2025, 9:23 AM IST

New Diaphragm Wall at Polavaram : ఏపీ జీవనాడి పోలవరం పనులు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పోలవరం ప్రాజెక్ట్ పునఃనిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ పనులను నేడు ప్రారంభించనున్నారు. సుమారు వెయ్యి కోట్ల వ్యయంతో 1.396 కిలోమీటర్ల పొడవైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇది సగం పూర్తి కాగానే దీనికి సమాంతరంగా దీనిపైనే ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్ పనులు కూడా ప్రారంభంకానున్నాయి. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డ‌యాఫ్రం వాల్ కాంక్రీట్ నిర్మాణ ప‌నుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.

ఉదయం10 గంటల 19 నిమిషాలను నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దెబ్బతిన్న పాత డయాఫ్రంవాల్‌కు 6 మీటర్ల ఎగువన 1.396 కిలో మీట‌ర్ల పొడ‌వున‌, 1.5 మీట‌ర్ల మందంతో కొత్త డ‌యాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం ప్లాస్టిక్ కాంక్రీట్-T5 మిశ్రమాన్ని వినియోగించనున్నారు. కనిష్ఠంగా 20 మీట‌ర్లు, గ‌రిష్ఠంగా 94 మీట‌ర్ల లోతు నుంచి నిర్మాణం చేపట్టనున్నారు. డయాఫ్రంవాల్‌ నిర్మాణాల్లో నైపుణ్యం ఉన్న బావర్‌ కంపెనీ ఈ పనులు చేపట్టనుంది. దీనికోసం 3 ట్రెంచ్ క‌ట్టర్లు, 3 భారీ గ్రాబ‌ర్లు, 3 డిశాండింగ్ యూనిట్లు వంటి భారీ యంత్రాలను జర్మనీ నుంచి తెప్పించారు.

పోలవరం ప్రభావంపై తెలంగాణ అధ్యయనం - నివేదిక కోరిన రేవంత్​రెడ్డి

డయాఫ్రంవాల్‌పైనే ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మించనున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పూర్తయితే గోదావరి నీటిని రిజర్వాయర్‌లో ఒడిసిపట్టేందుకు వీలవుతుంది. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయవచ్చు. గతంలో తెలుగుదేశం హయాంలోనే డయాఫ్రంవాల్‌ నిర్మించినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2020 గోదావరి వరదలకు డయాఫ్రమ్ వాల్ మూడు చోట్ల దెబ్బతింది. ఇసుక కోతకు గురై అగాధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వాటిని పూడ్చి, ఇసుకను వైబ్రో కాంపక్షన్ విధానం లో గట్టిపరిచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపడుతున్నారు.

కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో భాగంగా మొత్తం 383 ప్యానెల్స్‌తో లక్ష క్యూబిక్‌ మీటర్లకు పైగా ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్ని వినియోగించనున్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి 998 కోట్ల రూపాయల వ్యయం కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు డయాఫ్రమ్ వాల్ స‌గం నిర్మాణం పూర్తయ్యాక సమాంతరంగా ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం ప‌నులను చేప‌ట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిన్నరలోగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది.

2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల - సీఎం ఏమన్నారంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.