రీల్స్ మోజులో పాముతో విన్యాసాలు - కాటు వేయడంతో యువకుడి మృతి - Snake bite in Nizamabad - SNAKE BITE IN NIZAMABAD
🎬 Watch Now: Feature Video
Published : Sep 6, 2024, 2:34 PM IST
Snake bite : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామానికి చెందిన మోచి శివ రాజులు (23) పామును నోట్లో పెట్టుకుని వీడియో తీస్తూ విన్యాసాలు చేస్తుండగా పాము కాటు వేయడంతో మృతి చెందాడు. శివ రాజులు తండ్రి గంగారం వృత్తిరీత్యా పాములు పట్టేవాడు. తన కుమారుడికి కూడా పాములు పట్టడం నేర్పించాడు. ఈ క్రమంలో తమ గ్రామంలో గంగారం పాములు పట్టి కుమారుడు శివ రాజులుకు వీడియో తీసి గ్రూప్లో పోస్ట్ చేయమని చెప్పాడు. అది విన్న శివరాజులు విన్యాసాలు చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.
పాము కాటు వేయడంతో ప్రాణం కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషపూరిత ప్రాణులతో అలా చేయకూడదని విశ్లేషకులు చెబుతున్నారు. నోటిపైనే పాము కాటువేయడంతో యువకుడు కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. కాళ్లు, చేతులను పాము కాటు వేసినా, విషం శరీరమంతా వ్యాపించక ముందే ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు.