ఎనిమిదేళ్ల ప్రేమ - ప్రేయసి మోసం చేసిందని ప్రేమికుడు ఆత్మహత్య - Young Man Suicide failed love in ap - YOUNG MAN SUICIDE FAILED LOVE IN AP
🎬 Watch Now: Feature Video
Published : Aug 28, 2024, 5:07 PM IST
A Young Man Commits Suicide : ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయానని జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకరమైన ఘటన ఏపీలోని కర్నూల్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలోని గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జులకల్ గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు కర్నూల్ సిటీలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న లాడ్జ్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు.
ప్రేమలో మోసపోయానని, ఎవరూ ప్రేమించవద్దంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక అమ్మాయిని ఎనిమిదేళ్లుగా ప్రేమించానని, చివరికి ఇలా మోసపోయానని వాపోయాడు. ప్రేమికురాలి నాన్న కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపాడు. తన పరిచయాలతో సీఐ స్థాయి వ్యక్తుల నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి బరువెక్కిన గుండెతో అక్కడే ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు ఆత్మహత్యను గమనించిన లాడ్జ్ సిబ్బంది వెంటనే నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.