నందిని కోసం ఆగిన చంద్రన్న - జ్వరాన్నీ లెక్కచేయని అభిమానం ఆమెది - Madanapalle Woman Nandini - MADANAPALLE WOMAN NANDINI
🎬 Watch Now: Feature Video
Published : Jun 11, 2024, 3:49 PM IST
Madanapalle Woman : చంద్రబాబును చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగు తీసింది. ఆమెను గమనించిన చంద్రబాబు కారును ఆపి దగ్గరకు పిలిచి మాట్లాడారు. విజయవాడలో జరిగిన ఈ ఘటన చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తగా చంద్రబాబు సింప్లిసిటీకి అద్దం పడుతోంది. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని వివరించింది.
తనను చూసి భావోద్వేగానికి గురైన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. 'మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్, ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను' అంటూ ఆ మహిళ చెప్పగా చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫొటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చాను అని నందిని చెప్పగా, 'ముందు ఆసుపత్రికి వెళ్లు' అని చెప్పి ఆమె ఎక్కడ ఉంటారో పూర్తి వివరాలు తెలుసుకుని అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.