కుళాయి దొంగను పట్టించిన వాట్సాప్ గ్రూప్ - ఖాకీలకే మస్కా కొట్టి ఠాణా నుంచి పరార్ - Thief Escapes From Police Station - THIEF ESCAPES FROM POLICE STATION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 11:38 AM IST

Thief Escapes From Police Station : పోలీసులకే మస్కా కొట్టి ఓ దొంగ ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు. పరారైన దొంగను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఈ ఘటన హైదరాబాద్ యూసుఫ్​గూడ పరిధిలో జరిగింది. దుండగుడు చోరీలకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

పోలీసుల కథనం ప్రకారం యూసుఫ్​గూడ సమీపంలోని యాదగిరినగర్​లో ఇటీవల కాలంలో ఇళ్లలోని కుళాయిలు చోరికి  గురవుతున్నాయి. అనుమానం వచ్చి స్థానికులు దగ్గర్లోని  సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఓ దొంగ నల్లాలను కాజేస్తున్నట్లుగా కనిపించింది. ఈ వీడియోలు కాస్త బస్తీ కమిటీ నాయకులు వాట్సాప్​ గ్రూపుల్లో ఫార్వార్డ్​ చేశారు.

ఈ వీడియోలు చూసి అప్రమత్తమైన స్థానికులు.. దొంగ బుధవారం రోజున ఓ ఇంట్లో చొరబడి ట్యాప్​ను ఊడదీసీ చోరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అలా మధురానగర్​ ​ఠాణాలో​ ఉన్న ఆ దొంగ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. తప్పించుకున్న నిందుతుడి పేరు వికాస్​ అని, అతడు నేపాల్​ వాసి అని పోలీసులు తెలిపారు. దొంగ పరారవ్వడంతో వెంటనే పెట్రోలింగ్, బ్లా కోల్డ్స్​ పోలీసుల్ని అప్రమత్తం చేసి వెదికినా నిందితుడి జాడ లభ్యం కాలేదు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.