జాతీయ చిత్రలేఖనం పోటీల్లో తెలుగు తేజం - బాపట్ల జిల్లా విద్యార్థినికి ప్రథమ స్థానం - Bapatla dist student first place - BAPATLA DIST STUDENT FIRST PLACE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2024, 9:41 PM IST

A Student of Bapatla District Won the First Place : ప్రపంచ ఓజోన్ దినోత్సవం(world ozone day) సందర్భంగా భారత ప్రభుత్వం నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో తెలుగు తేజం మెరిసింది. అటవీ, పర్యావరణ, వాతావరణ శాఖలు 'మోంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్' అంశంపై జాతీయస్థాయిలో ఆగస్టులో చిత్రలేఖనం పోటీలు నిర్వహించాయి. దిల్లీలో పర్యావరణ శాఖ భారతీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పోటీలకు సంబంధించిన ఫలితాలను ఈరోజు(శుక్రవారం) ప్రకటించారు. ఇందులో బాపట్ల జిల్లా J. పంగులూరు మండలం కొండమంజులూరుకు చెందిన భవ్యశ్రీ ప్రథమస్థానంలో నిలిచింది.

భవ్యశ్రీ కొండమంజులూరులోని శ్రీ రావుల జానకి రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. చిత్రలేఖనంపై భవ్యశ్రీకి ఉన్న ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు తర్ఫీదు ఇచ్చి ప్రోత్సహించారు. ఉపాధ్యాయుడు ఇచ్చిన శిక్షణ, ఆమె ఏకాగ్రత చిత్రలేఖనం పోటీల్లో ప్రథమస్థానంలో నిలిపాయి. పాఠశాల పేరును, ఊరి ప్రతిష్ఠలను జాతీయస్థాయికి తీసుకెళ్లిన భవ్యశ్రీకి ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.