శ్రీ సత్యసాయి జిల్లాలో అమానుష ఘటన - ఏడేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య - seven Years Baby murder - SEVEN YEARS BABY MURDER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 10:37 PM IST

A Person Killed and Buried Seven year Old Girl in Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడో కిరాతకుడు. అనంతరం బాలికను నది ఒడ్డున పాతిపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే, శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గంగాధర్‌ గంజాయికి బానిసై ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. అనంతరం విషయం ఎవరికీ తెలియకుండా ఆ చిన్నారి మృత దేహన్ని నది ఒడ్డున పాతి పెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గంగాధర్ ఉన్న ప్రాంతానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. 

తరువాత ఘననాస్థలికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. గంగాధర్ ఇదివరకే రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయికి బానిసై అరాచకాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు గంగాధర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. మహిళలపై గంగాధర్ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.