నిర్మల్ జిల్లాలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు - మహిళ మెడలో నుంచి 3 తులాల గోల్డ్‌చైన్ అపహరణ - Chain Snatching AT Nirmal - CHAIN SNATCHING AT NIRMAL
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 5:27 PM IST
Chain Snatching In Nirmal District : నిర్మల్ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని శాంతినగర్, వివేకానంద చౌక్‌లోని మయూరి హోటల్ ముందు నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలోనుంచి 3 తులాల బంగారు గొలుసులను దుండగులు కాజేశారు. బైక్‌పై హెల్మెట్లు ధరించి వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ క్రమంలో మహిళ కిందపడింది. ఆమె అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేంతలోనే చైన్‌స్నాచర్లు అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైయ్యాయి. ఒక్కసారిగా మహిళ మెడలో నుంచి బంగారం గొలుసును దుండగులు తస్కరించడంతో స్థానికంగా కలకలం రేపింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తరచూ అవగాహన కల్పిస్తున్నారు. నేరాల నియంత్రణకు పోలీస్‌శాఖ ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.