మామిడి చెట్టు కొమ్మకు ఒకే చోట 55 కాయలు, ఎక్కడంటే? - 55 Mangoes In a Single Branch
🎬 Watch Now: Feature Video
55 Mangoes In a Single Branch To Tree : సాధారణంగా మామిడి చెట్టుకొమ్మకు ఒకే చోట నాలుగో లేదా అయిదు కాయలు కాయడం చూస్తుంటాం. కానీ ఒకే కొమ్మకు 55 మామిడి కాయలు కాయడం మీరెప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియో మీ కోసమే. సూర్యపేట జిల్లాకు చెందిన ఓ రైతు పొలంలో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన మోదాల గంగయ్యకు పొలంలో ఓ మామిడి చెట్టు ఉంది. అయితే ఆ చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. ఓ కొమ్మ మాత్రం మళ్లీ చిగురించి కాయలను విరగకాసింది. ఆ చిగురే కాయల రూపంలో ప్రతి ఫలించి ఏకంగా 55 మామిడి కాయలను కాసింది. అయితే చెట్టుకు నీరు పెట్టడం వల్ల ఎండిన కొమ్మ మళ్లీ చిగురించిందని రైతు చెప్పారు. చెట్టు మొత్తం మీద ఈ ఒక్క కొమ్మకే కాయలు కాసినట్లుగా వెల్లడించారు. ఈ విషయం తెలిసినవారందరూ చూసేందుకు వస్తున్నారు. చెట్టుకు నీరు పెట్టడం వల్ల కొమ్మ పూత పూసి కాయలుకాయడం పట్ల రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.