నిరుపేద కుటుంబంలో పుట్టిన యువతి - 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కైసవం - Chandrakala Gets 3 Central Jobs - CHANDRAKALA GETS 3 CENTRAL JOBS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-03-2024/640-480-21040952-thumbnail-16x9-chandrakala-interview.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 21, 2024, 7:17 PM IST
3 Central Govt Jobs To Chandrakala : నిరుపేద కుటుబంలో పుట్టిన ఆ యువతికి చదువు అంటే మహ ఆసక్తి. గొప్ప చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తాపత్రయ పడుతుండేది. కానీ, ఆమె కలను సాకారం చేసుకునే ప్రయాణంలో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి వాటికి తోడు తండ్రి మరణం ఆమెను కుంగదీసింది. అయినా ఏనాడు లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. కుటుంబ భాద్యతలు మోస్తూనే తన లక్ష్యాన్ని చేధించింది. పట్టుదలే పెట్టుబడిగా ప్రయత్నం ఆపకుండా నిర్విరామంగా శ్రమించింది.
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 3 కేంద్ర పభ్రుత్వ ఉద్యోగాలు కైవసం చేసుకుంది చంద్రకళ. ఆర్ఆర్బీ పీవో, ఎల్ఐసీలో ఏడీవో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ 3 ఉద్యోగాలు సాధించింది. కానీ ఎఫ్‌సీఐలో సేవ చేయడానికి ఎక్కవ అవకాశం ఉందని అందుకే ఇదే ఎంచుకున్నట్లు తెలిపింది. ఎఫ్‌సీఐ గ్రేడ్-3 ఉద్యోగంలో చేరిన ఆమె గ్రూప్ -1 పొందడమే తన లక్ష్యం అంటున్నారు. మరోవైపు తనలా ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న సాటి విద్యార్థులకు తీరిక దొరికితే తన వంతు సాయం చేస్తాను అంటుంది. తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లిందో తన మాటల్లోనే విందాం.