తనిఖీల్లో భారీగా నగదు పట్టివేత- కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి అనుచరుడిగా గుర్తించిన పోలీసులు - Money seized police checkings - MONEY SEIZED POLICE CHECKINGS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 5:46 PM IST
Cash Seized By Police in Bapatla District: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి పామాంజి నరసింహారావు అనే వ్యక్తి వద్ద రూ.23 లక్షలు పట్టుకున్నారు. పోలీసులను చూసి ఇంట్లో నుంచి హడావుడిగా బైక్పై వెళ్లేందుకు యత్నించిన నరసింహారావును పోలీసులు పట్టుకున్నారు. తనిఖీలు చేయగా ఆయన వద్ద 23 లక్షల రూపాయలతో ఉన్న సంచి పట్టుబడింది. పొలం అమ్మడంతో ఈ డబ్బులు వచ్చాయని నరసింహారావు పోలీసులకు చెప్పారు.
కానీ రూ. 23 లక్షలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేనందున డబ్బు సీజ్ చేశామని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ తెలిపారు. నరసింహారావు చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ అనుచరుడిగా పోలీసులు గుర్తించారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో ఎక్కువ మొత్తంలో ఉన్న డబ్బుకి సరైన ఆధారాలు లేకపోతే కచ్చితంగా సీజ్ చేస్తామని ఇది వరకే అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడటంతో స్థానికంగా కలకలం రేపుతోంది.