LIVE : 22 ఎలక్ట్రికల్ టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రారంభం
🎬 Watch Now: Feature Video
Published : Mar 12, 2024, 11:24 AM IST
|Updated : Mar 12, 2024, 12:04 PM IST
22 Electrical TSRTC Buses Start in Telangana : హైదరాబాద్లో టీఎస్ఆర్టీసీలోకి అదనంగా 22 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి. ఈ 22 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.ఫిబ్రవరి నెలలో 100 కొత్త బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్ప్రెస్ బస్సులను కేటాయించగా, హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో తొలిసారి 10 ఏసీ రాజధాని సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని బస్సులను ప్రారంభించారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు అన్ని కిక్కిరిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం ఇలా కొత్త బస్సులను ప్రారంభించడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడుపుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Last Updated : Mar 12, 2024, 12:04 PM IST