'సెలవు పెట్టినా నా బిడ్డ బతికేది' - కన్నీటిపర్యంతమైన హారిక తల్లి - 17 Members Dead Massive Explosion - 17 MEMBERS DEAD MASSIVE EXPLOSION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2024, 2:27 PM IST
Harika's Family Members Were in Tears : రక్షాబంధన్ వేడుకలకు ఇంటికి వచ్చి సోదరులతో ఆనందంగా గడిపిన క్షణాలు మరువక ముందే ఫార్మా కంపెనీలో ప్రమాదంతో హారిక తిరిగిరాని లోకాలకు చేరుకుందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తన జీవితానికి భద్రత ఉందనే భరోసాతో నిండు నూరేళ్లు జీవించాలనుకుందని కానీ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం అగ్నిప్రమాదం రూపంలో పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ అర్బన్ రెండో డివిజన్ సౌజన్య నగర్‌కు చెందిన హారిక తండ్రి ఈశ్వరరావు పదేళ్ల క్రితమే చనిపోయారు. తోబుట్టువైన అన్న ఇల్లు విడిచి వెళ్లిపోయారు. తల్లినానమ్మలతో కలిసి ఉంటూ కష్టపడి చదివి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
11 నెలల క్రితం ఉద్యోగంలో చేరింది. రాఖీ పండగతోపాటు, ఓ పోటీ పరీక్షకు హాజరయ్యేందుకు ఈ ఆదివారం హారిక కాకినాడకు వచ్చింది. బుధవారం సెలవు పెట్టేందుకు ప్రయత్నించిగా యాజమాన్యం అంగీకరించకపోవడంతో విధులకు వెళ్లి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృత్యువాతపడిందని కుటుంబ సభ్యులు వాపోయారు. పోస్టుమార్టం అనంతరం హారిక మృతదేహం కాకినాడ చేరుకోవడంతో బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. హారిక మృతదేహంపై పడి విలపిస్తున్న ఆమె తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సెలవు పెట్టినా కుమార్తె బతికేదని తల్లి అన్నపూర్ణ కన్నీటిపర్యంతమయ్యారు.