లారీ, అంబులెన్స్ ఢీ - మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధం - 108 Ambulance Vehicle Hit a Lorry - 108 AMBULANCE VEHICLE HIT A LORRY
🎬 Watch Now: Feature Video

Published : May 29, 2024, 4:31 PM IST
108 Ambulance Vehicle Hit A Lorry : ఓ లారీని 108 అంబులెన్స్ ఢీకొనడంతో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం నీలంనగర్ స్టేజీ వద్ద కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పీఏపల్లికి చెందిన 108 అంబులెన్స్ వాహనం హైదరాబాద్‌కు వెళ్లి మరమ్మతులు చేసుకొని వస్తోంది. ఈ క్రమంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో అంబులెన్స్, లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. అంబులెన్స్ డ్రైవర్ శేఖర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకుని సహాయకచర్యలు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ఎన్టీఆర్ ఘాట్ వైపు వెళ్తున్న హోండాసిటీ కారుతో పాటు మరో ద్విచక్ర వాహనాన్ని లక్డీకపూల్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్తున్న ఓ అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.