ETV Bharat / technology

యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్- సబ్​స్క్రిప్షన్ ధరల పెంపు - youtube premium plans price hike

Youtube Premium Subscription Prices: వినియోగదారులకు యూట్యూబ్ బిగ్​ షాకిచ్చింది. యూట్యూబ్ సబ్​స్క్రిప్షన్ ధరలను పెంచేసింది. ఫ్యామిలీ, స్టూడెంట్‌, వ్యక్తిగత ప్లాన్‌ అన్నింటిపై దాదాపు 58శాతం ధరల్ని పెంచింది. దీంతో ఇకపై యాడ్స్ లేకుండా కంటెంట్‌ వీక్షించేందుకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిందే.

Youtube_Premium_Subscription_Prices
Youtube_Premium_Subscription_Prices (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Aug 27, 2024, 3:47 PM IST

Updated : Aug 27, 2024, 4:14 PM IST

Youtube Premium Subscription Prices: భారత్​లో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్ ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ ధరలను పెంచేసింది. ఫ్యామిలీ, స్టూడెంట్‌, వ్యక్తిగత ప్లాన్లతో పాటు రెన్యువల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరల్ని 58శాతం పెంచేస్తూ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కొత్త ధరలు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వినియోగదారులకు వీటికి సంబంధించి ఇ-మెయిల్స్ పంపడం ప్రారంభించింది.

ఏంటీ యూట్యూబ్ ప్రీమియం సబ్​స్క్రిప్షన్​?:

  • యూట్యూబ్ సబ్​స్క్రిప్షన్​ తీసుకున్నవారు యాడ్స్​ లేకుండా కంటెంట్​ చూడొచ్చు.
  • 1080pలో అధిక బిట్​రేట్​ స్ట్రీమింగ్, ఆఫ్​లైన్ డౌన్​లోడ్, బ్యాక్​గ్రౌండ్ ప్లేబ్యాక్, యూట్యూబ్​ మ్యూజిక్​లో యాడ్స్ లేకుండా చూడొచ్చు.
  • ఇలా పలు రకాల ప్రయోజనాలను సబ్​స్క్రిప్షన్ తీసుకున్నవారు పొందొచ్చు.

ఎందుకు ధరలు పెంచింది?:

  • యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకొనేందుకు యూట్యూబ్‌ 30 సెకండ్ల పాటు అన్‌స్కిప్పబుల్‌ యాడ్స్‌ ఆప్షన్​ను చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది.
  • యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవటంలో భాగంగా ఏటా ప్రీమియం ధరలను పెంచడం, తగ్గించడం చేస్తోంది.
  • తాజాగా సబ్​స్క్రిప్షన్ ధరలను పెంచింది.

పెంచిన కొత్త ధరలు వివరాలు ఇలా:

  • వ్యక్తిగత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధర: యూట్యూబ్‌ వ్యక్తిగత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.149గా నిర్ణయించింది. ఇంతకు ముందు దీని ధర రూ.129గా ఉండేది.
  • ఫ్యామిలీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధర: గతంలో రూ.189గా ఉన్న ఈ ధరను ప్రస్తుతం రూ.299కి పెంచింది. ఫ్యామిలీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకుంటే కుటుంబంలోని ఐదుగురు ఈ ప్రయోజనాలు పొందొచ్చు.
  • స్టూడెంట్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధర: ఇక ప్రీమియం స్టూడెంట్‌ ప్లాన్‌ ధర రూ.79 నుంచి రూ.89కి పెంచింది.
  • వ్యక్తిగత ప్రీపెయిడ్‌ నెలవారి ప్లాన్ ధర: వ్యక్తిగత ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.159కి సవరించింది. గతంలో ఈ ధర కేవలం రూ.139గా ఉండేది.
  • వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్‌ ధర: ఇక వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్‌ ధరను రూ.399 నుంచి రూ.459కి సవరించింది.
  • వ్యక్తిగత వార్షిక ప్లాన్‌ ధర: గతంలో రూ.1290 ఉన్న దీని ధరను రూ.1490కి పెంచింది. అంటే ఏకంగా రూ.200 అధికంగా పెంచేసింది.

ఐఫోన్ లవర్స్​కు గుడ్​ న్యూస్- యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్​ - iphone 16 launch date

దిమ్మతిరిగే ఫీచర్లతో 'టీవీఎస్ జూపిటర్ 110'- ధర ఎంతంటే? - TVS Jupiter 110 Launched

ఫ్రీగా ఆధార్​ కార్డును అప్​డేట్​ చేసుకోవటం ఎలా?- ఈజీ ప్రాసెస్ ఇదే! - Aadhaar Card Free Update

Last Updated : Aug 27, 2024, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.