ETV Bharat / technology

ఎక్స్ యూజర్లకు గుడ్ న్యూస్​ - ఇకపై మీరు పేమెంట్స్ కూడా చేయవచ్చు! - X New Feature

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 11:01 AM IST

Updated : Aug 11, 2024, 11:48 AM IST

Payment Feature In X Twitter : సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ వాట్సాప్ ద్వారా ఇప్పటికే మనం పేమెంట్స్ చేస్తున్నాం. ఇకపై ఎక్స్ (ట్విట్టర్​) ద్వారా కూడా పేమెంట్స్ చేయవచ్చట! త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందట!

X New Feature
X New Feature (Getty Images)

Payment Feature In X Twitter : బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎక్స్​ (ట్విట్టర్​)ను సొంతం చేసుకున్న తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఒకప్పుడు సమాచారాన్ని షేర్​ చేసుకునేందుకు మాత్రమే వినియోగించిన యాప్​ను ఇప్పుుడు ఆల్​-ఇన్​-వన్ ప్లాట్​ఫామ్​గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈజీగా కనిపిస్తోంది. అందులో భాగంగా త్వరలో మరో ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఫీచర్​కు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్​గా మారింది.

ట్విట్టర్​ను ఎక్స్​గా మార్చాక సూపర్ యాప్​గా తీర్చిదిద్దుతానని అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే అనేక సందర్భాల్లో తెలిపారు. చెప్పినట్లే ఎక్స్​లో ఆడియో, వీడియో కాల్స్ సదుపాయం తీసుకొచ్చారు. మరిన్ని ఫీచర్లు పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా పేమెంట్స్‌ జరిపే సదుపాయాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. అందుకు సంబంధించి వెబ్​ డెవలపర్ నిమా అవుజి (Nima Owji) పోస్ట్ పెట్టారు. ఎక్స్​లో కొత్త ఫీచర్లకు సంబంధించి స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేశారు. త్వరలోనే పేమెంట్స్ ఆప్షన్ రానుందని తెలిపారు. ట్రానాక్షన్స్​ జరపడమే కాకుండా, బ్యాలెన్స్ కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. పేమెంట్స్ హిస్టరీ కూడా కనిపిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ఫీచర్ వాలెట్​లాగా ఉంటుందా? లేక బ్యాంక్ అకౌంట్​కు లింక్ చేయవచ్చా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

ప్రీమియం సేవలు ఉచితం
కొన్నిరోజుల క్రితం, 2500కు పైగా వెరిఫైడ్‌ ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు ప్రీమియం సేవల్ని ఉచితంగా అందివ్వనున్నట్లు ఎలాన్ మస్క్​ తెలిపారు. 5 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్న ఎక్స్‌ యూజర్లకు ప్రీమియం ప్లస్‌ సర్వీసులు ఫ్రీగా యాక్సెస్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కంటెంట్ క్రియేటర్లకు, ఇన్‌ఫ్లుయెన్సర్లు మెరుగైన ఫీచర్లు అందించాలనే ఉద్దేశంతో ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ప్రకారం, ప్రీమియం ప్లస్‌ చందాదారులు ప్రకటనలు లేకుండా ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. పోస్ట్‌ చేసిన ట్వీట్‌ను గంటలోపు ఎడిట్‌ చేయొచ్చు. 25,000 అక్షరాల వరకు పోస్ట్‌ చేసే సదుపాయం కూడా ఉంటుంది. ఇక ప్రీమియం, ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వాళ్లు కృత్రిమ మేధ సంస్థ ఎక్స్‌ఏఐ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ (Grok)ను యాక్సెస్‌ చేయొచ్చు. నెలకు రూ.1,300 లేదా ఏడాదికి రూ.13,600 వెచ్చించే ప్రీమియం ప్లస్‌ చందాదారులకు మాత్రమే గ్రోక్‌ అందుబాటులో ఉండేది.

ఇక చాట్‌జీపీటీలో ఇమేజ్‌ జనరేషన్‌ ఫ్రీ- కానీ ఓ కండిషన్​ - ChatGPT Image Generator

మీ పిల్లలు ఫోన్, టీవీలకు అతుక్కుపోతున్నారా? డోంట్ వర్రీ - ఈ టిప్స్ మీ కోసమే! - How To Prevent Gadget Addiction

Last Updated : Aug 11, 2024, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.