ETV Bharat / technology

వాట్సాప్​లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్- ఇకపై గ్రూప్​ చాట్​లో నో కన్ఫ్యూజన్! - WHATSAPP TYPING INDICATOR FEATURE

వాట్సాప్​లో 'టైపింగ్ ఇండికేటర్' ఫీచర్- ఇకపై చాటింగ్ మరింత ఈజీ!

WhatsApp
WhatsApp (WhatsApp)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 6, 2024, 3:18 PM IST

WhatsApp New Typing Indicator Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్​న్యూస్. ప్రముఖ ఇన్​స్టంట్ మెసెజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. 'టైపింగ్ ఇండికేటర్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్​ వినియోగదారులకు రియల్​ టైమ్ చాట్​ను మరింత ఈజీ చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫీచర్​ సహాయంతో ఇకపై గ్రూప్​ చాట్​లో కన్ఫ్యూజన్ ఉండదు. ఈ అప్‌డేట్ గురించి కంపెనీ గురువారం సమాచారం అందించింది.

ఏంటీ టైపింగ్ ఇండికేటర్?: మెటా యాజమాన్యంలోని వాట్సాప్​ ఈ అప్​డేట్​ గురించి తెలియజేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇకపై వాట్సాప్​లో మెసెజ్ టైప్ చేస్తున్నప్పుడు టైపింగ్ ఇండికేటర్ ఫీచర్ '...' విజువల్ ఇండికేషన్‌తో కన్పిస్తుంది. అది టైప్ చేస్తున్న యూజర్​ ప్రొఫైల్ ఇమేజ్‌తో పాటు చాట్ స్క్రీన్ కింద కన్పిస్తుంది.

WhatsApp New Typing Indicator Feature
WhatsApp New Typing Indicator Feature (WhatsApp)

ఈ ఫీచర్ ఉపయోగాలేంటి?: ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు యాక్టివ్‌గా చాట్ చేస్తున్న వ్యక్తి టైప్ చేస్తున్నప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే ఇకపై ఇప్పుడు ఎవరైనా మెసెజ్ టైప్ చేస్తుంటే.. విజువల్ ఇండికేటర్​తో పాటు టైపింగ్ ఇండికేటర్​ కూడా చాట్ స్క్రీన్‌పై కన్పిస్తుంది. దీంతో వినియోగదారులు ఎవరు మెసెజ్ టైప్ చేస్తున్నారో సులభంగా తెలుసుకోవచ్చు. దీంతో అవతలివారు సైతం సులభంగా చాట్ చేయగలుగుతారు.

ఫీచర్​ ద్వారా యూజర్​ ప్రొఫైల్ ఇమేజ్ కూడా కన్పించడంతో ముఖ్యంగా గ్రూప్ చాట్ చేస్తున్న వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో గ్రూప్​చాట్​లో ఒకేసారి ఎంతమంది చాట్ చేస్తున్నా ఇకపై కన్ఫ్యూజన్ ఉండదు. ఇంతకు ముందు యాక్టివ్ చాట్ సమయంలో టాప్ బ్యానర్‌లో ఎవరు టైప్ చేస్తున్నారో తెలియడానికి 'typing' అని మాత్రమే కన్పించేది.

ఎవరెవరికి అందుబాటులో ఉంది?: ఈ ఫీచర్​ ఫస్ట్ అప్డేట్​ను అక్టోబర్​ నెలలో అందించారు. ఆ సమయంలో ఇది కేవలం సెలెక్టెడ్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ప్రస్తుతం వాట్సాప్​లో ఈ 'టైపింగ్ ఇండికేటర్' ఫీచర్​ను iOS, Android యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

వన్​ప్లస్​ కమ్యూనిటీ సేల్ వచ్చేసింది- ఆ ఫోన్స్, టాబ్లెట్స్​, వాచ్​, ఇయర్​బడ్స్​పై ఆఫర్లే ఆఫర్లు..!

165KM రేంజ్​తో 'విడా వీ2' ఎలక్ట్రిక్ స్కూటర్లు- కేవలం రూ.96వేలకే..!

2025 హోండా అమేజ్ ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి? ఇది డిజైర్ కంటే మెరుగ్గా ఉందా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.