Whatsapp Meta AI Introduces 3 New Features: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో దూసుకెళ్తోంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తమ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మెటా ఏఐ పేరుతో సేవలను అందిస్తుండగా.. తాజాగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌లో మరిన్ని ఫీచర్లు జోడించింది. రియల్ టైమ్ కన్వర్జేషన్ సదుపాయాన్ని తీసుకొచ్చి ఏఐ సంభాషణల్ని మెరుగుపరిచింది. దీంతోపాటు మెటా ఏఐలో ఫొటోలను నచ్చినట్లుగా తీర్చిదిద్దే ఫీచర్లు కూడా జోడించింది. ఇంతకీ మెటా తీసుకొచ్చిన ఆ మూడు ఫీచర్లు ఏంటి? వాటి ఉపయోగం ఏంటి? వంటి వివరాలు మీకోసం.
రియల్ టైమ్ సంభాషణలు:
- మెటా ఏఐతో మీ సొంత వాయిస్‌తో రియల్ టైమ్ సంభాషణలు జరపొచ్చు.
- ఏవైనా ప్రశ్నలు అడగ్గాన్నే సంబంధిత విషయం గురించి స్పష్టంగా వివరిస్తుంది.
- దీని సాయంతో మీరు నేరుగా ప్రశ్నలు అడగొచ్చు. అంతేకాదండోయ్ ఇది మీ మూడ్‌కు తగ్గట్లు జోక్స్‌ను కూడా పంచుకుంటుంది.
- ఈ అడ్వాన్స్‌డ్ వెర్షన్ అత్యంత వేగంగా కూడా సమాధానాలు ఇస్తుందట.
- అంతే కాదు మెటా ఏఐ వాయిస్‌ని కూడా మార్చుకొనే అవకాశం కూడా ఉందని వాట్సప్ తెలిపింది.
- అక్వాఫినా, క్రిస్టెన్ బెల్, జాన్ సెనా, కీగన్-మైఖేల్ కీ, జూడి డెంచ్ వంటి ప్రముఖ వ్యక్తుల వాయిస్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు.
ఫొటోతో ప్రశ్నలు:
- సాధారణంగా మనకు ఏదైనా సందేహం ఉంటే మెటా ఏఐ చాట్‌ను ఓపెన్ చేసి టెక్ట్స్ టైప్ చేయాల్సి వస్తుంది.
- అయితే తాజాగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో ఫొటోతోనే సమాధానం పొందొచ్చు.
- అంటే వాయిస్ కమాండ్ పంపించే సమయం లేకపోయినా వెంటనే సమాధానం పొందేందుకు ఫొటోతో కూడా ప్రశ్నించవచ్చు.
- ఉదాహరణకు మీకు తెలియని భాషలో పదాలు లేదా ఫొటో ఉంది అనుకుందాం.
- అలాంటి సందర్భాల్లో ఆ ఫొటోను పంపించి దాని అర్థం ఏంటి అని అడగొచ్చు.
- వెంటనే ఇది మీకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.
ఫొటోస్ ఎడిట్ సదుపాయం:
- మెటా తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్లలో ఫొటోలను ఎడిట్ ఆప్షన్ ఒకటి.
- ఈ ఫీచర్‌తో ఫొటోలను ఎడిట్ చేసి వాటిని మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.
- మీరు ఏదైనా ఫొటో పంపి అందులోని కలర్స్ మార్చమని కమాండ్ ఇస్తే చాలు అది చిటికెలో మార్చి పంపుతుంది.
- అంతే కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లోని వ్యక్తులను తొలగించాలన్నా ఇట్టే తీసేస్తుంది.
- ఈ ఫీచర్‌తో ఇకపై ఫొటో ఎడిటింగ్ కోసం ఇతర ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.
- ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్‌లో ఉంది.
- త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
దేశంలోనే ఫస్ట్ ఎయిర్ ట్రైన్- ఉచితంగానే ప్రయాణం- ప్రారంభం ఎప్పుడంటే? - India First Air Train