Whatsapp New Feature for Video Calls: ప్రస్తుతం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ప్రజల జీవితాల్లో ముఖ్యభాగం అయిపోయింది. వాట్సప్ కాలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్‌లో పెద్ద మార్పే వచ్చిందని చెప్పొచ్చు. ఇలా ఎప్పటికప్పుడు వాట్సాప్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌కు సంబంధించి కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
ఇది వీడియో కాల్ సమయంలో కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఉపయోగపడునుంది. ఈ ఫీచర్ వినియోగంపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన వాట్సప్ ఛానల్ ద్వారా స్వయంగా వెల్లడించారు. అందుబాటులో ఉన్న వివిధ రకాల న్యూ ఫిల్టర్స్‌ను ఉపయోగించిన ఫొటోలను ఫాలోవర్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏంటీ ఫీచర్? ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.
వాట్సప్ కొత్త ఫీచర్ ప్రత్యేకతలివే:
- వాట్సప్ ఈ కొత్త ఫీచర్ సాయంతో వీడియోకాల్ మాట్లాడుతున్న సమయంలో మనకు నచ్చినట్లుగా స్క్రీన్‌ను మార్చుకునే అవకాశం రానుంది.
- అంటే వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో ఫిల్టర్లు, బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు నచ్చిన థీమ్‌ను సెట్ చేసుకోవచ్చు.
- మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో మీ మూడ్‌కు తగ్గట్లుగా బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చన్నమాట.
- ఉదాహరణకు మీరు వీడియోకాల్‌లో ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌ని రద్దీగా ఉండే కేఫ్‌లా అయినా లేకుంటే బీచ్‌లో ఉన్నట్లుగా అయినా మార్చేయొచ్చు.
- బ్లర్ ఎఫెక్ట్ లాంటి ఆప్షన్లు ఉంటాయి.
- 10 రకాల బ్యాక్‌గ్రౌండ్ ఎంపికలు ఉంటాయి.
- గోప్యతను కాపాడేందుకు స్టైలిష్ బ్యాక్గ్రైండ్ని జోడించొచ్చు.
- ఇందులో వార్మ్, కూల్, బ్లాక్ అండ్ వైట్, డ్రీమీ ఇలా 10 రకాల ఫిల్టర్లు అందుబాటులో ఉంటాయి.
- వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో మీ సంభాషణల్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ సరికొత్త ఫీచర్ సాయపడనుంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి ఎప్పుడు?:
- ఈ సరికొత్త ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పంచుకుంది.
- మరికొన్ని వారాల్లో ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులోకి రానుందని తెలిపింది.
- ఈ మేరకు వెల్లడిస్తూ ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పంచుకుంది.
జీమెయిల్లో సరికొత్త ఏఐ ఫీచర్- ఇకపై మీ రిప్లై మరింత స్మార్ట్ - Gmail Smart Reply Feature