ETV Bharat / technology

VPN ఆన్​- ఇంటర్నెట్ బంద్​- కారణమేంటి? - VPN Connection Internet issue

VPN Connection Internet Problem : చాలా మందికి వీపీఎన్​ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? వీపీఎన్​ ఉపయోగించడం వల్ల ప్రయోజనాలేంటి? వీపీఎన్​ ఉపయోగించే సమయంలో నెట్​ ఎందుకు కొన్నిసార్లు పనిచేయదు? వీటన్నింటికి సమాధానాలు మీకోసం.

VPN Connection Internet Problem
VPN Connection Internet Problem
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 6:36 PM IST

VPN Connection Internet Problem : అమెరికా నుంచి అంతరిక్షం వరకు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇంటర్నెట్​ ఉపయోగపడుతుంది. ఉద్యోగం, వ్యాపారం, చదువు ఇలా వివిధ పనుల కోసం ఇంటర్నెట్​ను ఉపయోగిస్తుంటారు. అయితే మనం నెట్టింట్లో ఏం చేస్తున్నామో, వేటికోసం వెతుకుతున్నాము మొదలైన సమాచారమంతా ఓ చోట రికార్డు అవుతూ ఉంటుంది. దీనినే యూజర్ యాక్టివిటీ అంటారు. దీన్ని కొన్నిసార్లు సైబర్​నేరగాళ్లు ట్రాక్ చేసే అవకాశం ఉంది. ట్రాక్ చేయడం వల్ల కొన్నిసార్లు యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది కలుుగుతుంది. అందువల్ల ప్రైవసీని మెరుగు పర్చేందుకు తెచ్చిందే ఈ వీపీఎన్​. ఇది ఎలా పనిచేస్తుంది? అనే విషయంతో పాటు కొన్నిసార్లు వీపీఎన్ అన్​ అయినప్పుడు ఇంటర్నెట్​ పనిచేయదు. మరి ఎందుకలా జరుగుతుంది మొదలైన విషయాలు తెలుసుకుందాం.

VPN ఎలా పనిచేస్తుంది?
మనం ఎలాంటి సమాచారాన్ని తెలుసుకోవాలన్నా కూడా సెర్చింజన్​లో వెతుకుతుంటాం. అయితే ఈ సమాచారంతా ఇంటర్​నెట్ సర్వీస్ ప్రొవైడర్​ వద్ద నిక్షిప్తం అవుతుంది. ఈ సమాచారాన్ని కొన్నిసార్లు వారు ఆయా ఈ కామర్స్​ కంపెనీలతో పాటు మరికొన్ని సంస్థలతో పంచుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందువల్ల ఇలా జరగకుండా ఉండేందుకు పరిష్కారమార్గంగా తీసుకువచ్చిందే ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్​వర్క్. ఈ వీపీఎన్​ టెక్నాలజీ మీ సమాచారాన్ని ఇతరులు తస్కరించకుండా చేస్తుంది. అయితే ఈ వీపీఎన్​ను ఉపయోగిస్తున్నప్పుడు కొన్నిసార్లు అసాధారణ పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు. వీపీఎన్​ ఆన్​లో ఉన్నప్పుడు ఇంటర్నెట్​కు కనెక్ట్​ చేయడంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురుకావచ్చు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.

ఇంటర్నెట్​​ నెమ్మదించడం
ఇంటర్నెట్ కనెక్షన్​ నెమ్మదిగా ఉన్నప్పుడు వీపీఎన్​ ఉన్నా లేకున్నా నెట్​కు కనెక్ట్​ అవ్వడానికి వీలుపడదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వీపీఎన్​ను డిస్​కనెక్ట్​ చేసి మళ్లీ ఇంటర్​నెట్​కు కనెక్ట్​ చేసేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మీ ఇంటర్నెట్ సర్వీస్​ ప్రొవైడర్లకు సంప్రదించాలి. సాధారణంగా మీ డివైస్​ను రీబూట్ ​చేసి నెట్​వర్క్​ తిరిగి పునరుద్ధరించుకోవచ్చు.

DNS Server Problem : వీపీఎన్​కు ఉపయోగించుకునే క్రమంలో డీఎన్​ఎస్​ కాన్ఫిగరేషన్ సమస్య కూడా ఎదురవ్వవచ్చు. ఫలితంగా వీపీఎన్​కు మీరు కనెక్ట్​ కాలేకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు డీఎన్​ఎస్​ సెట్టింగ్​లను మార్చుకోవాల్సి ఉంటుంది.

ఈ కింద సందర్భాల్లో వీపీఎన్ పనిచేయకపోవచ్చు

  • సర్వస్​ డౌన్​ అయినప్పుడు
  • ఏదైనా దేశం వీపీఎన్​ను బ్లాక్​ చేసినప్పుడు
  • వీపీఎన్​ ప్రొటోకాల్ తప్పుగా ఉన్నసందర్భంలో!

డీఫాల్ట్​ గేట్​వే సెట్టింగ్​లు (విండోస్​ యూజర్స్ కోసం)

  • Start>control panel>network&internet>network And sharing center>change Adapter settings
  • VPN కనెక్షన్​ అడాప్టర్​పై రైట్​ క్లిక్ చేయండి. ప్రొపర్టీస్​పై క్లిక్ చేయండి
  • నెట్​వర్క్​ ట్యాబ్​పై క్లిక్ చేయండి
  • ఇంటర్నెట్ ప్రొటోకాల్ వెర్షన్ 4(TCP/IPV4) ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • Properties > Advanced ఆప్షన్​ను ఎంచుకోండి తర్వాత ఐపీ సెట్టింగ్స్​ ట్యాబ్​పై క్లిక్ చేయండి
  • Use default gateway on the remote network ఆప్షన్​ను అన్​చెక్ చేయండి
  • ఆ తర్వాత మూడు సార్లు OK బటన్​పై క్లిక్ చేయండి

కిల్​స్విచ్ ఆప్షన్​
వీపీఎన్ కనెక్షన్ ప్రొవైడర్​ను ఎంపిక చేసుకున్న తర్వాత 'కిల్ స్విచ్'ను ఆన్ చేసుకోవాలి. ఒకవేళ వీపీఎన్ ఆగిపోతే ఇంటర్నెట్ బ్రౌజింగ్ నిలిచిపోయేలా ఈ 'కిల్ స్విచ్' పనిచేస్తుంది. తద్వారా ఇంటర్నెట్ యాక్టివిటీ సురక్షితంగా ఉంటుంది. వీపీఎన్ కనెక్షన్​ను లేటెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్​కు అనుగుణంగా అప్డేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

VPN Ban in India: దేశంలో వీపీఎన్​ బ్యాన్​! అసలేమైంది?

VPN: నెట్టింట సేఫ్​గా విహరించండిలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.