VIVO X200 Series Launched: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'వివో X200' సిరీస్ ఎట్టకేలకూ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ ఈ సిరీస్‌లో 'వివో X200', 'వివో X200 ప్రో' అనే రెండు మోడల్ మొబైల్స్‌ను రిలీజ్ చేసింది. ఈ రెండు ఫోన్లూ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో నడుస్తాయి. ఇది 3nm ప్రాసెసర్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు మీకోసం.
1. 'Vivo X200' స్పెసిఫికేషన్స్:
- డిస్ప్లే: 6.67-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ OLED LTPS
- పీక్ బ్రైట్‌నెస్: 1600నిట్స్
- చిప్సెట్: మీడియా టెక్ డైమెన్సిటీ 9400
- రిఫ్రెష్ రేట్: 120 Hz
- బ్యాటరీ: 5800mAh
- 90W స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్
- IP68 + IP69 రేటింగ్
కెమెరా సెటప్: ఇందులో సోనీ IMX921 OIS సెన్సార్‌తో 50MP రియర్ కెమెరా ఉంది. దీనితో పాటు ఈ ఫోన్లో 50MP శాంసంగ్ JN1 అల్ట్రా వైల్డ్, 50MP LYT600 3X పెరిస్కోపిక్ రియర్ కెమెరాలు ఉన్నాయి. Wi-Fi 7,6,5, డ్యూయల్ స్టీరియో స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో కూడిన ఫన్‌టచ్ ఓఎస్ 15తో వస్తోంది.
ధర:
- 12GB + 256GB వేరియంట్ ధర: రూ.65,999
- 16GB + 512GB వేరియంట్ ధర: రూ.71,999
2. 'Vivo X200 Pro' స్పెసిఫికేషన్స్:
- డిస్ప్లే: 6.78-అంగుళాల LTPO AMOLED
- రిజల్యూషన్: 1.5K
- రిఫ్రెష్ రేట్: 120Hz
- పీక్ బ్రైట్‌నెస్: 1800నిట్స్
- చిప్సెట్: మీడియా టెక్ డైమెన్సిటీ 9400
- 1.63mm అల్ట్రా-స్లిమ్ బెజెల్స్ సపోర్ట్
- బ్యాటరీ: 6000mAh
- బ్యాటరీ 90W స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్
- 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
కెమెరా సెటప్: ఈ మొబైల్లో 200MP HP9 పెరిస్కోపిక్ రియర్ కెమెరా, 50MP సోనీ ఎల్‌వైటీ- 818 సెన్సర్, 50MP శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. ముందు వైపు 32MP కెమెరా ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే ఫన్‌టచ్ OSతో ఔటాఫ్‌ది బాక్స్ వస్తోంది. IP68 + IP69 రేటింగ్, Wi-Fi 7,6,5, డ్యూయల్ స్టీరియో స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర: 16GB+ 512GB వేరియంట్ ధర: రూ.94,999
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. అయితే వీటి సేల్స్ 19 డిసెంబర్ 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ సైట్ అమెజాన్ నుంచి కొనుగోలు చేయొచ్చు. వీటిని HDFC కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
వాట్సాప్‌లో మరో అద్భుతం.. ఇకపై చాట్ బాక్స్‌లోనే ట్రాన్స్లేషన్..! అదెలాగంటే?
స్టన్నింగ్ లుక్.. దిమ్మతిరికే ఫీచర్లు- టయోటా కొత్త ప్రీమియం సెడాన్ చూశారా?
యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్- కంటెంట్ ఖండాలు దాటేలా.. వారిపై ఇక కాసుల వర్షమే!