ETV Bharat / technology

కొత్త ఫోన్ కొనాలా? టాప్​-5 అప్​కమింగ్ మొబైల్స్ ఇవే - ధర ఎంతంటే? - Upcoming Smartphones 2024 - UPCOMING SMARTPHONES 2024

Upcoming Smartphones 2024 : మీరు కొత్త ఫోన్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. త్వరలో అదిరిపోయే ఫీచర్లతో 5 టాప్​ బ్రాండెడ్ ఫోన్లు ఇండియాలో లాంఛ్ కానున్నాయి. వాటిలో గూగుల్​, మోటరోలా, వన్​ప్లస్​, శాంసంగ్​, రియల్​మీ కంపెనీలకు చెందిన స్మాల్​, మిడ్​, ప్రీమియం రేంజ్​ ఫోన్లు ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

top smartphones launching in India 2024
Upcoming Smartphones 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 1:12 PM IST

Updated : Mar 23, 2024, 1:28 PM IST

Upcoming Smartphones 2024 : స్మార్ట్​ఫోన్ లవర్స్​ అందరికీ గుడ్​ న్యూస్​. త్వరలో ఇండియన్ మార్కెట్లో స్మాల్​, మిడ్, ప్రీమియం రేంజ్​ల్లోని చాలా స్మార్ట్​ఫోన్లు లాంఛ్ కానున్నాయి. వాటిలోని టాప్​-5 ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Google Pixel 8a : గూగుల్ కంపెనీ పిక్సెల్​ 8ఏ లాంఛ్​ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. కానీ మే 14న జరగనున్న డెవలపర్ల సమావేశంలో దీనిని ప్రకటించే అవకాశం ఉంది. టెన్సర్ G3, google AI ఫీచర్లతో ఇది వస్తుంది. పిక్సెల్ 8a 6.1 అంగుళాల 120Hz OLED డిస్​ప్లే కలిగి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే పిక్సెల్​ 7ఏ మాదిరిగానే దీనిలో 64MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 13MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా దీనిలో సర్కిల్-టు-సెర్చ్ లాంటి AI ఫీచర్లు ఉన్నాయి. ఇండియాలో పిక్సెల్​ 8ఏ ధర సుమారుగా రూ.50,000 వరకు ఉండవచ్చు.

Moto Edge 50 Pro : మోటరోలా ఎడ్జ్​ 50 ప్రో ఫోన్​ను ఏప్రిల్ 3న లాంఛ్​ చేయనున్నారు. AI ఫీచర్లతో, స్నాప్​డ్రాగన్​ 8జెన్​ 3 ప్రాసెసర్​తో ఇది వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, మెటల్ ఫ్రేమ్​తో ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కలిగి ఉంటుంది. ఈ మోటో ఎడ్జ్​ 50 ప్రో 144Hz రిఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాల 1.5k రిజల్యూషన్ కర్వ్​డ్​ OLED డిస్​ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో ట్రిపుల్ కెమెరా సెటప్​ ఉంటుంది. దీనిలోని 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో 8కె వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే పాంటోన్ కలర్స్​ను కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. అంతేకాదు దీనిలో ఏఐ వాల్​పేపర్ జనరేటర్ కూడా ఉంటుంది. ఈ ఫ్లాగ్​షిప్​ ఫోన్​లో 4,500mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇది 125W వైర్డ్ , 50W వైర్​లెస్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుంది. దీని ధర గురించి మోటరోలా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

OnePlus Nord CE 4 : వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 ఏప్రిల్​ 1 ఇండియన్ మార్కెట్లో లాంఛ్ కానుంది. దీనిలో స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 3 ప్రాసెసర్ ఉంది. దీనిలో 8 జీబీ ర్యామ్​, 256 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్ ఉన్నాయి. ఈ వన్​ప్లస్​ ఫోన్​లో 5000mAh ​సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుంది. దీనిలో ఎడ్జ్​-టు-ఎడ్జ్​ 1.5కె రిజల్యూషన్ డిస్​ప్లే, ఇన్​-డిస్​ప్లే ఫింగర్​ప్రింట్ సెన్సార్​ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 14 బేస్డ్​ ఆక్సిజన్ ఓఎస్​ 14తో పనిచేస్తుంది. దీని ధర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Samsung Galaxy M55 : శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎం55ను బహుశా గెలాక్సీ ఏ35, ఏ55 ఫోన్లను లాంఛ్ చేసిన తరువాత, దీనిని విడుదల చేసే అవకాశం ఉంది. దీనిని గెలాక్సీ ఏ55ను ఇన్​స్పిరేషన్​గా తీసుకుని రూపొందించారు. ఈ గెలాక్సీ ఎం55 అనేది ప్లాస్టిక్ ఫ్రేమ్​తో వస్తుంది. ఇది స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 1 ప్రాసెసర్​, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్​లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే దీనిలో 50 ఎంపీ లేదా 60 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. ఇండియాలో ఈ ఫోన్ ధర బహుశా రూ.30,000 వరకు ఉంటుందని అంచనా.

Realme GT 5 Pro : రియల్​మీ త్వరలోనే జీటీ 5 ప్రో ఫోన్​ను లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిలో స్నాప్​డ్రాగన్​ 8జెన్​ 3 ప్రాసెసర్ అమర్చారు. ఈ అప్​కమింగ్ ఫోన్​లో ఐకూ 12, వన్​ప్లస్​ 12లో ఉన్న స్పెసిఫికేషన్లే ఉండవచ్చని అంచనా. వాస్తవానికి ఈ రియల్​మీ జీటీ 5 ప్రో గత నెలలోనే చైనాలో రిలీజ్​ అయ్యింది. ఇది మెటల్​ ఫ్రేమ్​, వేగన్​ లెదర్ బ్యాక్​ ప్యానెల్​తో ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కలిగి ఉంటుంది. దీనిలో 5,400mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్​ ఫాస్ట్ ఛార్చింగ్, 50వాట్​ వైర్​లెస్​ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. దీనిలో 6.7 అంగుళాల కర్వ్​డ్​ డిస్​ప్లే ఉంటుంది. దీని ధర ఇండియాలో ఎంత ఉంటుందో చూడాలి.

ఇన్​స్టాగ్రామ్​లో స్క్రీన్​షాట్​ తీస్తే - ఆ విష‌యం అవతలి వ్యక్తికి తెలుస్తుందా? - Instagram Screenshot

వాట్సాప్​ నయా ఫీచర్​ - టెక్ట్స్‌ రూపంలో వాయిస్‌ మెసేజ్‌! - Whatsapp Voice Message Transcripts

Last Updated : Mar 23, 2024, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.