Upcoming Smartphones in December 2024: ఇండియన్ మార్కెట్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఇటీవల 'రియల్మీ GT 7 ప్రో' మొబైల్ లాంఛ్ అయింది. ఈ ప్రాసెసర్‌తో దేశీయ మార్కెట్లో రిలీజ్ అయిన మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇప్పుడు ఇదే చిప్‌సెట్‌తో మరిన్ని స్మార్ట్ఫోన్లు ఈ నెలలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఈ ఫ్లాగ్షిప్ మొబైల్స్‌తో పాటు టెక్నో నుంచి ఫోల్డబుల్ ఫోన్లు కూడా ఈ డిసెంబర్లో రిలీజ్ కానున్నాయి.
అలాగే వీటితో పాటు పోకో నుంచి కూడా కొత్త ఫోన్ రిలీజ్ కావచ్చు. వీటితో పాటు భారత మార్కెట్లోకి అనేక ఇతర స్మార్ట్ఫోన్లు కూడా డిసెంబర్ 2024లో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2024లో లాంఛ్ కానున్న మొబైల్స్, వాటి ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుకుందాం రండి.
ఈ డిసెంబర్లో లాంఛ్ కానున్న మొబైల్స్ ఇవే!:
1. iQOO 13: 'ఐకూ 13' మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో డిసెంబర్ 3న ఇండియాలో రిలీజ్ కానుంది. AnTuTuలో ఈ ఫోన్ స్కోర్ 3 మిలియన్ కంటే ఎక్కువ స్కోర్ సాధించింది. ఈ ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్సీతో ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్స్ కలిగి ఉందని కంపెనీ చెబుతోంది.
Experience premiumness from every angle and elevate your style! 🔥The Halo light of the stunning #iQOO13 doesn’t just light up—it transforms every moment “iconic”. ✨
— iQOO India (@IqooInd) November 30, 2024
Experience the extraordinary starting 3rd Dec, exclusively at @amazonIN and https://t.co/bXttwlZo3N!
Know More… pic.twitter.com/CezelC3M1M
ఇతర ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.82-అంగుళాల BOE Q10 LTPO AMOLED
- రిజల్యూషన్: 2K
- రిఫ్రెషన్ రేట్: 144Hz
- బ్రైట్నెస్: 4,500 nits
కెమెరా సెటప్: ఈ ఫోన్ 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు 50MP 3x టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో 32MP కెమెరా ఉండొచ్చు.
2. 'Vivo X200' సిరీస్: 'వివో X200' సిరీస్‌ను లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇది ఈ డిసెంబరులో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 'వివో X200' మీడియాటెక్ 9400 ప్రాసెసర్‌తో రానుందని తెలుస్తోంది. ఇది 16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS 4.0 స్టోరేజీని కలిగి ఉంటుందని సమాచారం.
ఈ సిరీస్ రిలీజ్ అయితే అందులో 'వివో X200', 'వివో X200 ప్రో' రెండు మోడల్స్ రానున్నాయి. వీటిలో 'వివో X200'.. 50MP సోనీ IMX882 టెలిమాక్రో 3x సెన్సార్‌తో రావొచ్చు. అదే సమంయలో 'వివో X200 ప్రో' మోడల్లో 3.7x ఆప్టికల్ జూమ్‌తో 200MP శామ్‌సంగ్ HP9 టెలిమాక్రో సెన్సార్ ఉండొచ్చు. అయితే రెండు ఫోన్‌లూ ఒకే 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది.
3. OnePlus 13: 'వన్‌ప్లస్ 13' స్మార్ట్‌ఫోన్ డిసెంబర్లో ఇండియాలో రిలీజ్ కానుంది. ఒప్పో సబ్-బ్రాండ్ అయిన ఈ కంపెనీ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో పాటు 'వన్‌ప్లస్ 13R', 'వన్‌ప్లస్ వాచ్ 3'లను కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.82 అంగుళాల BOE X2 AMOLED
- రిజల్యూషన్: 2K
- బ్రైట్నెస్: 4,500 నిట్స్
- ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్
- కెమెరా సెటప్: ఈ వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండొచ్చు.
- ఈ ఫోన్ వాటర్ రెసిస్టెన్సీతో IP68 అండ్ IP69 రేటింగ్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
4. టెక్నో 'Phanton V Fold 2' and 'Phantom V Flip 2': టెక్నో వచ్చే నెలలో ఇండియాలో 'టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 2', 'టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 2' స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోందని కొన్ని నివేదికలు వెల్లడించాయి. 'టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 2' మోడల్ ఇటీవల ప్రారంభించిన 'ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్' మొబైల్ రీబ్యాడ్జ్ చేసిన వేరియంట్ కావచ్చు. 'ఫాంటమ్ V ఫ్లిప్ 2' మొబైల్లో 6.9 అంగుళాల ఫుల్ HD+ LTPO AMOLED ప్రైమరీ డిస్‌ప్లే, 3.64 అంగుళాల AMOLED ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే ఉంటుంది.
అదే సమయంలో 'ఫాంటన్ V ఫోల్డ్ 2'లో 7.85-అంగుళాల LTPO AMOLED మెయిన్ డిస్‌ప్లే, 6.42-అంగుళాల LTPO AMOLED ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్‌తో రానుంది. ఇక 'ఫ్లిప్ 2' మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌తో రానుంది.
5. POCO F7: పోకో భారత మార్కెట్లో తన 'F' సిరీస్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. 'పోకో F7' మోడల్ నంబర్ 2412DPC0AI తో BIS వెబ్‌సైట్‌లో ధృవీకరణను పొందింది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లపై ఇంకా ఎలాంటి సమాచారం రివీల్ అవ్వలేదు.
ప్రీమియం బైక్ కొనడం మీ కలా?- వెంటనే త్వరపడండి- త్వరలో వాటి ధరలు భారీగా పెంపు!
2025లో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?- ఇది ఏ రాశులపై ప్రభావం చూపిస్తుందంటే..?