ETV Bharat / technology

ట్రూకాలర్ వెబ్​ వెర్షన్ రిలీజ్​ - ఇకపై PCలోనూ రియల్ టైమ్ నోటిఫికేషన్స్​! - Truecaller For Web - TRUECALLER FOR WEB

Truecaller For Web : ట్రూకాలర్‌ తాజాగా వెబ్​ వెర్షన్‌ను లాంఛ్​ చేసింది. దీనిని మీ పర్సనల్​ కంప్యూటర్​లో ఇన్​స్టాల్​ చేసుకుని, కొత్త నంబర్లను వెబ్‌లోనే వెతకవచ్చు. రియల్​టైమ్​లో నోటిఫికేషన్స్ కూడా పొందవచ్చు.

Truecaller now available on web
Truecaller For Web
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 5:09 PM IST

Truecaller For Web : ట్రూకాలర్​ మరో కొత్త ఫీచర్​తో ముందుకొచ్చింది. వాట్సాప్​, టెలిగ్రామ్ తరహాలో 'ట్రూకాలర్​ వెబ్​ వెర్షన్​'ను తాజా లాంఛ్ చేసింది. దీనిని మీ పర్సనల్ కంప్యూటర్​, ల్యాప్​టాప్​ల్లో ఇన్​స్టాల్ చేసుకుని, మీ కాంటాక్ట్​ లిస్ట్​లో లేని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్​, మెసేజ్​లను ఎవరు చేశారో సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాదు రియల్​ టైమ్​లోనే నోటిఫికేషన్లు కూడా పొందవచ్చు. ప్రస్తుతానికి ట్రూకాలర్ వెబ్​వెర్షన్​ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ​

ట్రూ కాలర్‌ వెబ్‌ వెర్షన్​ సాయంతో ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ ఫోన్​ను పీసీ లేదా ల్యాప్‌టాప్‌నకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా తమ ఫోన్​కు వచ్చిన మెసేజ్​లను నేరుగా పీసీలోనే చదవవచ్చు. అక్కడి నుంచి రిప్లై కూడా ఇవ్వవచ్చు. అలాగే ఏదైనా కాల్‌ లేదా మెసేజ్‌ వచ్చినప్పుడు, ఫోన్‌ చూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా డెస్క్​టాప్​ లేదా ల్యాప్​టాప్​లోనే ఇన్‌కమింగ్ కాల్‌/మెసేజ్‌ అలర్ట్‌లను పొందవచ్చు. మీరు ట్రూకాలర్​ వెబ్‌కు కనెక్ట్‌ అవ్వగానే, మొబైల్‌లో అప్పటివరకు ఉన్న సందేశాలను ట్రూకాలర్‌ సెకన్లలో చూపిస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా కాంటాక్టు వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే కంప్యూటర్‌ కీబోర్డు సాయంతో వేగంగా సందేశాలను పంపించవచ్చు. పైగా ఇవి మొబైల్‌ తరహాలోనే డెస్క్‌టాప్‌లోనూ ఎన్‌క్ట్రిప్ట్‌ అయి ఉంటాయి. కనుక మీ ప్రైవసీకి ఎలాంటి భంగం ఏర్పడదు.

ట్రూకాలర్​ వెబ్​ను ఎలా కనెక్ట్ చేయాలి?
వాట్సప్‌ వెబ్‌ తరహాలోనే ట్రూకాలర్‌ వెబ్‌ను సులువుగా డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్​టాప్​నకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్​ యూజర్లు తమ ఫోన్​లోని ట్రూకాలర్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో దిగువన ఉండే 'మెసేజెస్‌' ట్యాబ్‌లో పైన ఉన్న త్రీ డాట్స్‌ మెనూ ఓపెన్‌ చేయాలి. అక్కడ 'మెసేజింగ్‌ ఫర్‌ వెబ్‌' అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని ఎంచుకోవాలి. తరువాత డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ బ్రౌజర్లో web.truecaller.com అని సెర్చ్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలి. అంతే సింపుల్​. మీ డివైజ్​ ట్రూకాలర్ వెబ్​తో లింక్ అయిపోతుంది. ఇకపై నేరుగా కాల్స్​, మెసేజెస్​లకు సంబంధించిన నోటిఫికేషన్స్​ పీసీ స్క్రీన్​పైనే కనిపిస్తాయి.

గూగుల్ న్యూ AI ఫీచర్స్ - ఇకపై మీ పనులన్నీ ఈజీగా కంప్లీట్​! - Google Cloud Next 2024

స్విచ్​​ ఆఫ్​ అయినా మీ ఫోన్​ను ఈజీగా కనిపెట్టొచ్చు! అందుబాటులోకి గూగుల్​ సరికొత్త ఫీచర్​! - Google Find My Device Network

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.