ETV Bharat / technology

వీడియో ఎడిటింగ్​కు ఉపయోగపడే టాప్​-6 ఫ్రీ ఏఐ టూల్స్ ఇవే! - Free AI Tools For Video Editing - FREE AI TOOLS FOR VIDEO EDITING

Top 6 Free AI Tools For Video Editing : మీకు వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇష్టమా? సరైన సాఫ్ట్​వేర్ కోసం వెతుకుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్​-6 ఫ్రీ ఏఐ టూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.​

best AI Tools For Video Editing
Top 6 Free AI Tools For Video Editing
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 11:35 AM IST

Top 6 Free AI Tools For Video Editing : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా హవా నడుస్తోంది. అందుకే చాలా మంది సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లు కావాలని ఆశపడుతున్నారు. అయితే ఇది అంత సులువైన పనికాదు. మంచి కంటెంట్ ఉంటే సరిపోదు. దానిని చక్కగా ప్రెజెంట్ చేయగలగాలి. అందుకు మంచి వీడియో ఎడిటింగ్​ సాఫ్ట్​వేర్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని చాలా మంది కొనుగోలు చేయలేరు. అందుకే ఈ ఆర్టికల్​లో పూర్తి ఉచితంగా లభించే టాప్​-6 ఏఐ వీడియో ఎడిటింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం.

6. OpenShot : ఓపెన్​షాట్ అనేది ఒక ఓపెన్​-సోర్స్​ వీడియో ఎడిటర్​. ఇది చాలా యూజర్​ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది చాలా వీడియో ఫార్మాట్లను, రిజల్యూషన్లను సపోర్ట్​ చేస్తుంది. దీని ద్వారా మీ వీడియోకు మంచి ఎఫెక్ట్స్​ను జత చేయవచ్చు. ఆడియోను కూడా మోడిఫై చేసుకోవచ్చు.

5. Shotcut : ఈ షాట్​కట్​ అనేది మోస్ట్​ పవర్​ఫుల్​ వీడియో ఎడిటర్​. ఇది బిగినర్స్​కు మాత్రమే కాదు, అడ్వాన్స్​డ్​ వీడియో ఎడిటర్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది. దీనితో 4కె రిజల్యూషన్​లో వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీనిలో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఆడియో, వీడియో ఫిల్టర్లను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఏఐ టూల్ పూర్తిగా ఉచితం.

4. VEED.IO : వీడ్​.ఐఓ అనేది ఒక ఆన్​లైన్ వీడియో ఎడిటింగ్​ ప్లాట్​ఫామ్​. దీనిలో చాలా ఎడిటింగ్​ టూల్స్, ఫీచర్స్ ఉన్నాయి. దీని ద్వారా యానిమేషన్స్ కూడా చేసుకోవచ్చు. క్విక్​గా, ఈజీగా వీడియో ఎడిటింగ్​ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. కనుక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్​కు, మార్కెటింగ్​ చేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని బేసిక్ వెర్షన్​ పూర్తిగా ఉచితం. ప్రో వెర్షన్​ను మాత్రం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది.

3. Wise Cut : వైజ్​ కట్ అనేది ఒక ఏఐ-పవర్డ్​ వీడియో ఎడిటింగ్ టూల్​. కనుక ఇది మీ వీడియో క్వాలిటీని పెంచుతుంది. షేక్ అవుతున్న వీడియో ఫుటేజ్​ను స్టెబిలైజ్ చేస్తుంది. దీనితో కలర్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు వీడియోను స్ల్పిట్​ చేసి, సీన్స్​గా మార్చుకోవచ్చు. దీని బేసిక్ వెర్షన్​ను పూర్తి ఉచితంగా వాడుకోవచ్చు. ప్రోవెర్షన్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

2. Clipchamp : క్లిప్​చాంప్​ అనేది యూజర్ ఫ్రెండ్లీ ఏఐ-వీడియో ఎడిటింగ్ టూల్​. దీనిలో వైడ్​-రేంజ్​ ఫీచర్లు ఉన్నాయి. దీని ద్వారా వీడియో ట్రిమ్మింగ్​, క్రాపింగ్​, ట్రాన్సిషన్స్ లాంటివి చేయవచ్చు. ఇది ఏఐ-పవర్డ్ టూల్​ కాబట్టి, మీ వీడియో క్వాలిటీ కూడా ఎన్హాన్స్​ అవుతుంది. దీనిలో ఉన్న మరో బెస్ట్ క్వాలిటీ ఏమిటంటే, రియల్​ టైమ్​లో మీ టీమ్​ మెంబర్స్​తో కలిసి ప్రాజెక్ట్​ను ఎడిట్ చేసుకోవచ్చు. దీనిలోని బేసిక్ వెర్షన్ పూర్తిగా ఉచితం. ప్రీమియం వెర్షన్​ను మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

1. Davinci Resolve : ప్రొఫెషనల్ లెవెల్​లో ఎడిటింగ్ చేయడానికి డవిన్చీ రిసాల్వ్​ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో చాలా అడ్వాన్స్​డ్ ఫీచర్లు ఉంటాయి. సినిమాలు, టీవీ ప్రోగ్రామ్​లు ఎడిట్ చేయడానికి దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సాఫ్ట్​వేర్​ ద్వారా అడ్వాన్స్​డ్ కలర్​ కరెక్షన్, కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు 8కె రిజల్యూషన్​తో, విజువల్ ఎఫెక్ట్స్​ + మోషన్​ గ్రాఫిక్స్​తో వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీనిలో ఫ్రీ వెర్షన్​, పెయిడ్ వెర్షన్స్​ రెండూ ఉన్నాయి.

ఆఫీస్ ఫోన్​/ కంప్యూటర్స్ వాడుతున్నారా? ఈ 15 పనులు అస్సలు చేయకండి! - Dos and Donts on Office Laptop

గూగుల్ అప్​కమింగ్​ ఫీచర్​ - దొంగ ఫోన్ స్విఛ్ ఆఫ్ చేసినా - ఈజీగా కనిపెట్టేయవచ్చిలా! - Google Find My Device Network

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.