ETV Bharat / technology

వారెవ్వా.. వోక్స్‌వ్యాగన్ నయా కారు ఫస్ట్ లుక్​ అదుర్స్- రిలీజ్ ఎప్పుడంటే? - VOLKSWAGEN TAYRON SUV

వోక్స్‌వ్యాగన్ కొత్త టైరాన్ ఎస్‌యూవీ ఆవిష్కరణ- ఫస్ట్ లుక్​ మామూలుగా లేదుగా!!!

Volkswagen Tayron SUV
Volkswagen Tayron SUV (Volkswagen)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 11, 2024, 4:07 PM IST

Volkswagen Tayron Unveiled: వాహన ప్రియులకు గుడ్​న్యూస్. మార్కెట్లోకి త్వరలో కొత్త కారు ఎంట్రీ ఇవ్వనుంది. జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తన కొత్త టైరాన్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇందులో ప్రాక్టికాలిటీ, ఆన్‌బోర్డ్ టెక్నాలజీతో నాలుగు ఇంజిన్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ స్థానాన్ని ఇది రీప్లేస్ చేయనుంది. టిగువాన్ వెర్షన్​కు చెందిన ఈ త్రీ- రో వెర్షన్​ను ఈ ఏడాది ప్రారంభంలో బీజింగ్ మోటార్ షోలో ప్రదర్శించారు. దీనికి 'టిగువాన్ ఎల్ ప్రో' అనే కోడ్ నేమ్​ ఇచ్చారు. ప్రస్తుతం దీని ఫస్ట్ లుక్​ రివీల్ చేశారు. ఈ కారు 198 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తోంది. దీని బూట్ ఫ్లోర్ కింద 19.7kWh బ్యాటరీ ఉంది. ఈ సందర్భంగా ఈ కారుపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

ఫీచర్లు:

Volkswagen Tayron SUV
Volkswagen Tayron SUV (Volkswagen)
  • 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
  • 12.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌
  • 15-అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే ఆప్షనల్ ఫీచర్
  • అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
  • లేన్ కీప్ అసిస్ట్
  • అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్
  • వీటితో పాటు ఇందులో ఇతర ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఇంజిన్ ఆప్షన్స్: వోక్స్‌వ్యాగన్ టెరాన్ నాలుగు ఇంజిన్ ఆప్షన్స్​తో వస్తోంది. ఇందులో పెట్రోల్, ప్యూర్ పెట్రోల్, పెట్రోల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్, డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇది 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్‌తో స్టార్ట్ అవుతుంది. ఇది ముందు చక్రాలకు 148 bhp పవర్​ను అందిస్తుంది. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 201 bhp లేదా 261 bhp పవర్​ని జనరేట్ చేస్తుంది.

Volkswagen Tayron SUV
Volkswagen Tayron SUV (Volkswagen)

టర్బో డీజిల్ ఇంజిన్: పైన పేర్కొన్న వాటితో పాటు 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్​ కూడా ఇందులో ఉంది. ఇది 148 bhp లేదా 190 bhp పవర్‌తో వస్తుంది. ఫస్ట్ ఆప్షన్​లో ఫ్రంట్-వీల్ డ్రైవ్‌, రెండోది VW.. 4Motion 4WDతో వస్తుంది. ఈ వేరియంట్స్​లో ప్రతిదీ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్​గా వస్తుంది.

Volkswagen Tayron SUV
Volkswagen Tayron SUV (Volkswagen)

ఆటోమెటిక్ గేర్​బాక్స్: ఇది PHEV (ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్) శ్రేణిలో అగ్రస్థానంలో ఉంది. ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో కూడిన నాలుగు-సిలిండర్ ఇంజిన్, ఆరు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఈ సిస్టమ్ ముందు చక్రాలకు 201 bhp లేదా 268 bhp పవర్​ను అందిస్తుంది. రెండు వేరియంట్స్​కు 100 కి.మీ కంటే ఎక్కువ రేంజ్​ను కంపెనీ క్లెయిమ్ చేసింది. దీని 19.7kWh బ్యాటరీని 50kW DC ఛార్జర్‌తో ఛార్జ్ చేయొచ్చు.

Volkswagen Tayron SUV
Volkswagen Tayron SUV (Volkswagen)

వోక్స్‌వ్యాగన్ టైరాన్ రిలీజ్ ఎప్పుడంటే?: ఈ కొత్త టైరాన్ UK డెలివరీస్ మార్చి 2025లో ప్రారంభమవుతాయి. దీని ధర టిగువాన్ ఆల్‌స్పేస్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కారు 2025 చివరి నాటికి భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. భారత్​లో ఈ కారు జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటితో పోటీపడుతుంది.

పండగ వేళ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు- సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 530 కి.మీ ప్రయాణం - BYD eMax 7 Launched

రతన్ టాటాని ఆలోచనలో పడేసిన సంఘటన- నానో కారు లాంచ్​ చేసేందుకు రీసన్ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.