Tata and Kia Cars Price Hike: కొత్త సంవత్సరానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ కార్ల తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా దేశీయంగా తమ ఉత్పత్తుల ధరలు పెంచేస్తున్నాయి. ప్రముఖ సంస్థలు ఇప్పటికే ధరల పెంపును ప్రకటించగా.. తాజాగా టాటా మోటార్స్, కియా కూడా ఆ జాబితాలో చేరాయి. వచ్చే ఏడాది నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఈ ధరల పెంపు ఎప్పటి నుంచి? ఎంత శాతం? వంటి వివరాలు మీకోసం.
కొత్త ధరలు ఎప్పటినుంచి?: జనవరి 1 నుంచి సవరించిన ఈ సవరించిన ధరలు అమల్లోకి రానున్నట్లు టాటా మోటార్స్, కియా సంస్థలు తెలిపాయి. ఈ మేరకు తమ ప్యాసింజర్ వెహికల్స్ ధరలను 3 శాతం వరకు పెంచనున్నట్లు టాటా మోటార్స్ సోమవారం తెలిపింది. వీటితో పాటు ఎలక్ట్రికల్ వాహనాల ధరలనూ పెంచుతున్నట్లు పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
మరోవైపు ఆటోమొబైల్ కంపెనీ కియా సైతం జనవరి 1 నుంచి తన కార్ల ధరలను 2 శాతం మేర పెంచనున్నట్లు ప్రకటించింది. ముడిసరకు ధరలు పెరగడం, సప్లయ్ చైన్ వ్యయాలు అధికమవ్వడం కారణంగా ధరలను పెంచక తప్పడం లేదని పేర్కొంది. ఇప్పటి వరకు దేశీయంగా 16 లక్షల యూనిట్లు విక్రయించినట్లు కియా ఓ ప్రకటనలో తెలిపింది.
ధరల పెంపు జాబితాలో ఉన్న మిగతా కంపెనీలు ఇవే!: హ్యూందాయ్ మోటార్ ఇండియా, నిస్సాన్ ఇండియా, ఆడి ఇండియా, BMW ఇండియా, మెర్సిడెస్ బెంజ్, మారుతి సుజుకి, మహింద్రా & మహింద్రా వంటి సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరల పెంపుపై ప్రకటించాయి. అయితే కొంతమందికి మాత్రం ఈ ధరల పెంపు వర్తించదని మెర్సిడెస్ కంపెనీ తెలిపింది. ఇంతకీ ఈ వెసులుబాటు ఎవరికి? ఏ సంస్థలు ఎప్పటి నుంచి ఎంత శాతం ధరలను పెంచుతున్నాయి? కొత్త సంవత్సరంలో ఏ మోడల్ కార్ల ధరలు పెరగనున్నాయి? వంటి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టైలిష్ లుక్, దిమ్మతిరిగే ఫీచర్లు.. టయోటా నయా మోడల్ భలే ఉందిగా..!
క్రేజీ ఫీచర్లతో రూ.10వేలకే 5G స్మార్ట్‌ఫోన్!- ఎక్కడో తెలుసా?
వారెవ్వా.. గూగుల్ 'విల్లో' వెరీ పవర్ఫుల్ బాస్- దీని స్పీడ్‌కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే!