ETV Bharat / technology

ఐఫోన్ యూజర్లకు గుడ్​న్యూస్! ఈ కొత్త ఫీచర్​తో మీ డేటా మరింత సేఫ్​!

Stolen Device Protection Iphone : ఐఫోన్​ వినియోగదారులకు శుభవార్త. మీరింకా పాత iOS వాడుతున్నారా ? అయితే వెంటనే కొత్త సాఫ్ట్​వేర్​ను అప్​డేట్​ చేసుకోండి. ఇందులోని ఒక ఫీచర్ మీకు చాలా మేలు చేస్తుంది. అదేంటంటే?

Stolen Device Protection Iphone
Stolen Device Protection Iphone
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 1:50 PM IST

Stolen Device Protection Iphone : ఐఫోన్ భద్రతకు పెట్టింది పేరు. ఇందులోని సెక్యూరిటీ ఫీచర్స్ కారణంగానే ఐఫోన్​ను​ చాలా మంది ఉపయోగిస్తారు. కొంచెం రేటు ఎక్కువైనా సాధ్యమైతే ఐఫోన్​ను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఇందులోని ఎకో ఫ్రెండ్లీ నేచర్, చాలా మంది దీన్నొక స్టేటస్ సింబల్ లాగా చూడటం కూడా కారణాలుగా చెప్పవచ్చు.

అయితే తాజాగా ఐఫోన్ వినియోగదారులకు ఆ సంస్థ గుడ్​న్యూస్ చెప్పింది. iOS 17.3 సాఫ్ట్​వేర్​ అప్​డేట్​​ను తీసుకొచ్చింది. ఇందులోని ఓ ఫీచర్ మీ భద్రతను మరింత పెంచుతుంది. ఆ ఫీచర్ పేరే 'స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్'. ఇది మీ వ్యక్తిగత వివరాలు మరొకరి చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. ఫోన్ దొంగతనానికి గురైనప్పుడు, వేరొకరు ఉపయోగించిన సందర్భంలో మీకు ఉపయోగపడుతుంది.

యాక్సెస్​ చేయడం అంత ఈజీ కాదు
'స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్' ఫీచర్, ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీని మించి డేటా లాక్ చేస్తుంది. ఒకవేళ మీ ఫోన్ చోరీకి గురైతే ఎవరికైనా మీ పాస్​వర్డ్​ తెలిసినా ఈ ఫీచర్​ను ఆన్ చేయడం వల్ల మీ డేటాను యాక్సెస్ చేయలేరు. ముఖ్యంగా ఐక్లౌడ్ కీచైన్​లోని పాస్​వర్డ్​ యాక్సెస్ చేయలేరు. మొత్తంగా చెప్పాలంటే ఇది మీ ఫోన్​లోని గోప్యమైన సమాచారానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ఇందులోని మరో ఫీచర్ ఏంటంటే మీరు యాపిల్ ఐడీ వంటి సెక్యూరిటీ సమాచారాన్ని మార్చాలనుకున్నప్పుడు దాదాపు గంట సేపు వేచి ఉండాల్సి వస్తుంది. తర్వాతే ఫేస్ ఐడీ, టచ్ ఐడీ పనిచేస్తుంది. దీని వల్ల మన ఫోన్ పోయినప్పుడు ఇతరులు డేటా యాక్సెస్ చేయడం లేదా పాస్​వర్డ్​ మార్చటం లాంటివి సులభంగా చేయలేరు.

ఫ్యామిలీతో ప్లేలిస్ట్​ షేర్​ చేసుకోవచ్చు
ఈ అప్​డేట్​లో యాపిల్ మ్యూజిక్ ఫీచర్ కూడా మార్చింది. తాజా అప్​డేట్​తో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్​తో కలిసి ప్లే లిస్టును షేర్ చేసుకోవచ్చు. కమ్యూనల్ ప్లే లిస్టులో మీకిష్టమైన పాటను అందరూ వినేలా యాడ్ చేయవచ్చు. వాల్ పేపర్లో కూడా కొత్త అప్​డేట్ తీసుకొచ్చారు. యూనిటీ వాల్ పేపర్ అనే ఫీచర్ తెచ్చారు. దీన్ని యాపిల్ వాచ్​తో కనెక్ట్ చేయవచ్చు.

యాపిల్ ఐఓఎస్ 17.3 అప్​డేట్​ ఐప్యాడ్ ఓఎస్ 17.3, వాచ్ ఓఎస్ 10.3, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.3 ఆపరేటింగ్ సిస్టమ్​లలో అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు పాత ఐఓఎస్ ఉపయోగిస్తున్నట్లైతే వెంటనే అప్​డేట్​ చేసుకోండి. దీనికోసం సెట్టింగ్స్​లోకి వెళ్లి, జనరల్ అండ్ సాఫ్ట్​వేర్​ అప్​డేట్​ను ఎంచుకుని అప్​డేట్​పై క్లిక్ చేయండి. ఒకవేళ మీకు కొత్త అప్​డేట్​ అందుబాటులో ఉంటే డౌన్​లోడ్​ చేసుకుని ఇన్​స్టాల్​ చేసుకోండి.

మీ ఫోన్లో స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఆన్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి Face ID & Passcode Authenticate ఎంచుకుని పాస్​వర్డ్​ ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ Stolen Device Protection ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని Enable చేసుకోండి.

BSNL సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్- డేటా అధికంగా వాడేవారికి పండగే!

వన్​ప్లస్ 12 సిరీస్ లాంఛ్​ - ఫీచర్స్​, స్పెక్స్​ అదుర్స్​ - ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.