ETV Bharat / technology

జియో కస్టమర్లకు అదిరే గుడ్​న్యూస్- ఆ రీఛార్జ్​ ప్లాన్లపై భారీ ఆఫర్స్! - JIO Anniversary Offers

author img

By ETV Bharat Tech Team

Published : Sep 5, 2024, 5:09 PM IST

Updated : Sep 5, 2024, 5:34 PM IST

JIO Anniversary Offers: జియో కస్టమర్లకు గుడ్​ న్యూస్. రిలయన్స్ జియో ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా యూజర్లకు భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్లపై మరిన్ని ప్రయోజనాలను అందించనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో జియో ప్రకటించిన భారీ ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం రండి.

JIO_Anniversary_Offers
JIO_Anniversary_Offers (ETV Bharat)

JIO Anniversary Offers: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లకు అదిరే శుభవార్త తెచ్చింది. జియో తన 8వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రతి సంవత్సం లాగానే ఈ ఏడాది కూడా యూజర్లకు ప్రత్యేక ఆఫర్లను అనౌన్స్ చేసింది. తన మూడు రీఛార్జ్​ ప్లాన్లతో పాటు మరికొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈరోజు నుంచి సెప్టెంబర్ 10వ తేది లోపు రీఛార్జ్ చేసే కస్టమర్లకు మాత్రమే ఈ ప్రయోజనాలు దక్కుతాయని తెలిపింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.

జియో ప్రకటించిన ఆఫర్స్ ఇవే:

  • జియో వార్షిక ప్రయోజనాల్లో భాగంగా రీఛార్జిలపై 175 రూపాయల విలువైన వోచర్‌ అందిస్తోంది.
  • ఈ వోచర్‌ కింద 28 రోజుల పాటు 10 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనాలు, 10జీబీ డేటా పొందొచ్చు.
  • జియో బెస్ట్ క్వార్టర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అయిన రూ. 899, రూ. 999, బెస్ట్ యాన్యువల్ ప్లాన్ అయిన రూ. 3,599 ప్రీపెయిడ్ ప్లాన్ పైన అదనపు బెనిఫిట్స్ ప్రకటించింది.
  • అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది.
  • దీంతోపాటు Ajioలో రూ. 2,999 పైబడి షాపింగ్ చేసే వారికి రూ. 500 విలువైన అజియో వోచర్‌ కూడా అందించనుంది.
  • రూ.2,999 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో Ajioలో షాపింగ్ చేసేటప్పుడు ఈ కూపన్ వర్తిస్తుంది.
  • వీటితో పాటు 3 నెలల Zomato Gold Membership ను కూడా ఈ ఆఫర్​లో భాగంగా ఉచితంగా అందిస్తుంది.
  • ఈ ఆఫర్లు జియో అందిస్తున్న మూడు రీఛార్జి ప్లాన్‌లకే వర్తిస్తాయి.

రీఛార్జ్ ప్లాన్లు ఇవే:

  • జియో అందిస్తున్న రూ.899 త్రైమాసిక ప్లాన్‌తో 90 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ ప్లాన్‌ రీఛార్జితో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు. దీంతోపాటు 20జీబీ డేటా అదనం.
  • దీంతోపాటు 98 రోజుల వ్యాలిడిటీతో జియో తీసుకొచ్చిన మరో ప్లాన్‌ ధర రూ.999. ఈ రీఛార్జిపై రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 2జీబీ డేటా పొందొచ్చు.
  • జియో అందిస్తున్న రూ.3,599 ప్లాన్‌తో అపరిమిత కాలింగ్‌ లభిస్తాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2.5జీబీ డేటాను పొందొచ్చు. ఈ ప్యాక్‌ వ్యాలిడిటీ 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.

కాగా టెలికాం రంగంలో 8 సంవత్సరాల క్రితం అడుగుపెట్టిన జియో.. ఇప్పటి వరకు 49 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. టెలికాం రంగంలో రారాజుగా కొనసాగుతోంది.

కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందా?- ఈ టిప్స్ పాటిస్తే సగం డబ్బులు మిగిలినట్లే! - How to Reduce Electricity Bill

ప్రపంచంలోనే మొట్ట మొదటి ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్​- లాంచ్ ఎప్పుడంటే? - World First Tri Foldable Mobile

Last Updated : Sep 5, 2024, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.