ETV Bharat / technology

విమానాన్ని వాడని మోదీ- రైలులో ప్రయాణం- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? - PM Modi Traveled in Train Force One

author img

By ETV Bharat Tech Team

Published : Aug 25, 2024, 12:59 PM IST

Updated : Aug 25, 2024, 1:11 PM IST

PM Modi Traveled in Train Force One: ప్రధాని మోదీ యుద్ధ భూమి ఉక్రెయిన్​లో పర్యటించారు. అయితే ఆయన ఈ పర్యటనలో విమానాన్ని ఉపయోగించలేదు. 'ట్రైన్ ఫోర్స్ వన్' అనే ఓ రైలులో ప్రయాణించారు. లగ్జరీ విమానాన్ని వదలి రైలులోనే ప్రధాని ఎందుకు ప్రయాణించారు? దీని ప్రత్యేకత ఏంటి? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.

PM_Modi_Traveled_in_Train_Force_One
PM_Modi_Traveled_in_Train_Force_One (ETV Bharat)

PM Modi Traveled in Train Force One: ఉక్రెయిన్- రష్యా యుద్ధం మొదలై రెండేళ్లు దాటిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా కీవ్​లో పర్యటించారు. అయితే ఇతర దేశాల మాదిరిగా విమానంలో కాకుండా పోలెండ్ నుంచి 'ట్రైన్ ఫోర్స్ వన్' అనే ఓ రైలులో వెళ్లారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్​లో 7 గంటలు గడిపేందుకు ప్రధాని ఈ రైలులో 20 గంటలు ప్రయాణించారు. ఈ నేపథ్యంలో ఈ 'ట్రైన్ ఫోర్స్ వన్' రైలు ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రైన్ ఫోర్స్ వన్ ప్రత్యేకత ఏంటి?:

  • ఇది కేవలం రాత్రి పూట మాత్రమే నడిచే స్లో మూవింగ్ లగ్జరీ రైలు.
  • ఈ రైలును అందమైన, అత్యాధునిక ఇంటీరియర్​తో డిజైన్ చేశారు.
  • ఇందులో విలాసవంతమైన క్యాబిన్లు ఉంటాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు రెస్ట్ తీసుకునేందుకు సౌకర్యవంతమైన బెడ్​రూమ్​ కూడా ఉంది.
  • ఈ ట్రైన్ చూడటానికి రైల్వే ట్రాక్​పై ప్రయాణిస్తున్న లగ్జరీ హోటల్​లా ఉంటుంది.

విమానాన్ని వదిలి రైలులోనే ఎందుకు వెళ్లారు?:

  • సాధారణంగా విదేశీ పర్యటనల కోసం మోదీ ఎయిరిండియా వన్ లగ్జరీ విమానాన్ని వినియోగిస్తుంటారు. దిల్లీ నుంచి పోలెండ్​కు ఈ ఫ్లైట్​లోనే బయలుదేరి వెళ్లారు. అయితే యుద్ధం కారణంగా ఉక్రెయిన్​లోని అనేక ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి. ఎక్కడి నుంచి ఏ మిసైల్స్ వచ్చి పడతాయో తెలియని పరిస్థితి.
  • ఈ పరిస్థితుల్లో రోడ్డు మార్గంలో ప్రయాణించటం కూడా అంత సేఫ్ కాదు.
  • ఈ నేపథ్యంలో అత్యాధునిక భద్రతా చర్యలతో రూపొందించిన ఈ బుల్లెట్ ప్రూఫ్ రైలులో ప్రధాని మోదీ ప్రయాణించారు.

ట్రైన్ ఫోర్స్​ వన్ పేరు ఎలా వచ్చింది?:

  • అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం పేరు 'ఎయిర్ ఫోర్స్ వన్'. అందులో సెక్యూరిటీ విశేషాలు, లగ్జరీ సౌకర్యాల గురించి కథలుగా చెప్పుకుంటారు. అ తర్వాత అలాంటి విమానాలను చాలా దేశాల అధినేతలు చేయించుకున్నారు. ఆ స్థాయిలో కాకపోయినా భారత ప్రధానికి కూడా ఓ స్పెషల్ ఫ్లైట్ ఉంది.
  • ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్​ కూడా మిగతా దేశాల్లో మాదిరిగా ఎయిర్​ ఫోర్స్ వన్ లాంటి విమానం కాకుండా ఓ రైలును రెడీ చేసుకుంది.
  • ఈ రైలులో ప్రధాని మోదీ కంటే ముందు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రయాణించారు.
  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, అప్పటి ఇటలీ ప్రధాని ఈ రైలులో ప్రయాణించారు.
  • అప్పటి నుంచి ఈ రైలు పేరు 'ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌' లేదా 'రైల్‌ ఫోర్స్‌ వన్‌'గా మారిపోయింది.
  • అంతేకాకుండా ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభం అయిన సమయంలో లక్షలాది మంది ఉక్రెయిన్‌ వాసులను సురక్షిత ప్రాంతాలకు ఈ రైలు తరలించింది.

'ఆడి క్యూ8' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ఎస్​యూవీ లాంచ్- ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? - Audi Q8 Facelift Launched

'ఏఐలో 12.5 లక్షల ఉద్యోగాలు'- ఈ స్కిల్స్ నేర్చుకో జాబ్ పట్టుకో! - JOBS IN ARTIFICIAL INTELLIGENCE

Last Updated : Aug 25, 2024, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.