Phone Overheating Tips : నేటి ఆధునిక ప్రపంచంలో మనిషి జీవితంలో మొబైల్‌ఫోన్ ఒక భాగం అయిపోయింది. ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొదలు పెడితే.. పేమెంట్స్ వరకు ఎన్నో పనులు స్మార్ట్‌ఫోన్ సహాయంతో చిటికెలో పూర్తవుతున్నాయి. అందుకే.. దీన్ని మనిషి నుంచి వేరు చేయడం అసాధ్యంగా మారిపోయింది. అయితే.. ఇలాంటి స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు కాస్త వేడెక్కుతుంది. కానీ.. కొన్ని ఫోన్లు ఓవర్ హీట్ అవుతుంటాయి. ఈ సమస్య సమ్మర్‌లో ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఒక్కోసారి తేడా వస్తే మొబైల్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి.. ఛార్జింగ్ పెడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరి, స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ పెడుతున్నప్పుడు హీట్ కాకుండా ఉండటానికి ఎటువంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం.
ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఈ టిప్స్ పాటించండి :
- మీ ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు హీట్ అవుతుంటే.. ఈ సారి ఛార్జింగ్ పెట్టేముందు ఫోన్ కేస్ (పౌచ్)ను తీసేయండి.
- ముఖ్యంగా మీరు ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఉపయోగిస్తుంటే తప్పకుండా కేస్ తీసేయండి. ఇలా చేయడం వల్ల ఫోన్ వేడెక్కడం తగ్గుతుంది.
- అలాగే ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు ఫోన్‌లో ఎటువంటి గేమ్స్ ఆడకండి. అలాగే సినిమాలు చూడటం కూడా చేయకండి.
- ఇలా చేయడం వల్ల ఫోన్‌లోని ప్రాసెసర్‌లు హీట్ అవుతుంటాయి. అలాగే బ్యాటరీపై ఒత్తిడి కలిగి ఫోన్ వేడెక్కుతుంది. కాబట్టి, ఛార్జ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించకండి.
- అలాగే ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోయిన తర్వాత ఛార్జ్ చేసే అలవాటును మానుకోండి. వీలైనంత వరకూ బ్యాటరీ 20 శాతం ఉన్నప్పుడే ఛార్జింగ్ చేస్తే మంచిది.
హ్యాకర్స్ నుంచి Wifiను కాపాడుకోవాలా? ఈ 6 టిప్స్ మీ కోసమే! - How To Protect Wifi From Hackers
- ఇంకా ఫోన్ ఎప్పుడూ కూడా 100 శాతం ఛార్జ్ చేయకండి. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది.
- ఎప్పుడూ కూడా మీ ఫోన్‌కు వచ్చిన బ్రాండెడ్ ఛార్జింగ్ కేబుల్‌ను మాత్రమే ఉపయోగించండి.
- మార్కెట్లో దొరికే డూప్లికేట్ ఛార్జింగ్ కేబుల్‌లను ఉపయోగించడం వల్ల కూడా ఫోన్ హీట్ అవుతుందని నిపుణులంటున్నారు.
- ఫోన్‌ను ఎప్పుడైనా కూడా వేడిగా ఉండే ప్రాంతంలో గానీ లేదా వేడిగా ఉండే రూమ్‌లో ఛార్జ్ చేయకండి. దీనివల్ల ఫోన్ ఇంకా వేడేక్కుతుంది.
- కాబట్టి, ఫోన్‌ను ఛార్జ్ చేసేటప్పుడు ఏసీ గదిలో లేదా ఫ్యాన్ కింద పెట్టండి.
- అలాగే పాడైపోయిన ఛార్జింగ్ కేబుల్‌లను ఉపయోగించకండి. దీనివల్ల ఫోన్ తొందరగా పాడవుతుంది.
- మీ ఫోన్ వేడిగా ఉన్నట్లు అనిపిస్తే ఆ టైమ్‌లో ఎట్టిపరిస్థితుల్లో కూడా ఛార్జింగ్ పెట్టకండి. దీనివల్ల ఫోన్ ఇంకా హీట్ అవుతుంది. కాబట్టి, ఫోన్ కూల్‌గా ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టేలా చూసుకోండి.
- ఈజాగ్రత్తలు పాటించడం వల్ల ఫోన్ ఓవర్ హీట్ కాకుండా ఉంటుందని నిపుణులంటున్నారు.
యాపిల్ యూజర్స్‌కు గుడ్ న్యూస్ - ఇకపై పాత ఫోన్ పార్ట్స్‌తో రిపేర్! - Apple Expands Repair Options