ETV Bharat / technology

మీ స్మార్ట్​ ఫోన్ బాగా వేడెక్కుతోందా? ఈ టాప్​-10 టిప్స్​తో కూల్ చేసేయండిలా! - Phone Overheating

How To Fix Phone Overheating Issue : వేసవిలో మీ స్మార్ట్ ఫోన్ వేడెక్కుతోందా? అయితే ఈ స్టోరీ మీకోసమే. కారులో ఫోన్ పెడుతున్నారా? ఎండలో వీడియో గేమ్స్ ఆడుతున్నరా? అయితే జాగ్రత్త సుమా! స్మార్ట్ ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే?

Phone overheating reasons
tips to keep your phone cool (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 12:52 PM IST

How To Fix Phone Overheating Issue : దేశంలో ఎండలు భగభగమంటున్నాయి. ఆల్ టైమ్ గరిష్ఠానికి ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మనుషులకే కాదు స్మార్ట్ ఫోన్లకు కూడా ఎండ దెబ్బ తగులుతోంది. ఎండ వేడిమికి స్మార్ట్ ఫోన్లు వేడెక్కిపోతున్నాయి. దీంతో బ్యాటరీ పనితీరు దెబ్బతింటుంది. పైగా దాని లైఫ్ కూడా తగ్గిపోతుంది. అందుకే మీ స్మార్ట్‌ ఫోన్ వేసవిలో వేడెక్కకుండా, కూల్​గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సూర్యకాంతిలో ఫోన్​ను వాడకండి
మీ ఫోన్​ను సూర్యకాంతిలో ఎక్కువగా వాడొద్దు. ఒకవేళ ఎండలో ఉంచితే మీ స్మార్ట్ ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ఫోన్​ బ్రైట్ నెస్​ను కూడా తగ్గించండి. అప్పుడే ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.

2. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ కవర్​ను తీసేయండి
ప్రస్తుత కాలంలో చాలా స్మార్ట్ ఫోన్లు గంటలోపే 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతున్నాయి. కొన్ని స్మార్ట్ ఫోన్లు కేవలం రెండు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, దాని వల్ల ఫోన్ వేడెక్కిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఛార్జింగ్ పెట్టినప్పుడు మీ ఫోన్ కవర్​ను తీసేయండి.

3. వేడి వాతావరణంలో గేమ్స్ ఆడకండి
వేసవికాలంలో ఆరుబయట లేదా వేడి గదుల్లో ఎక్కువసేపు వీడియో గేమ్​లను ఆడితే స్మార్ట్‌ ఫోన్‌ వేడెక్కే ప్రమాదం ఉంది. మీరు కనుక ఏసీ రూమ్​లో వీడియో గేమ్స్ ఆడుకోవడం వల్ల మీ ఫోన్ వేడెక్కదు.

4. ఫోన్ బ్రైట్ నెస్​ను తగ్గించుకోండి
మీ ఫోన్ బ్రైట్ నెస్​ను తగ్గించుకోండి. లేదంటే మీ ఫోన్ హీట్ ఎక్కే ప్రమాదం ఉంది.

5. జీపీఎస్​ను ఆఫ్​ చేయండి
చాలా మంది ఫోన్​ను కారు డాష్ బోర్డులో ఉంచుతారు. కారును నావిగేట్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ వంటి యాప్స్​ను వాడుతారు. అయితే వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి నావిగేషన్ యాప్స్ వాడడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. ఈ వేడిని తగ్గించడానికి డ్రైవింగ్ చేసేటప్పుడు మీ ఫోన్‌ ను ఏసీ వెంట్ పక్కన ఉంచండి. మీరు బైక్​లో వెళ్తుంటే బ్యాగ్ లేదా జేబులో ఫోన్​ను ఉంచుకోండి.

6. మీ ఫోన్​కు కాస్త రెస్ట్ ఇవ్వండి
మీ ఫోన్​ను అదే పనిగా మరీ ఎక్కువగా వాడకుండా, కాస్త పక్కనపెట్టండి. అలా చేయడం వల్ల ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.

7. ఒర్జినల్ ఛార్జర్లను వాడండి
మీ ఫోన్​తో వచ్చిన ఒర్జినల్ ఛార్జర్​తోనే ఛార్జింగ్ పెట్టండి. వేరే ఛార్జర్​తో మీ ఫోన్​కు ఛార్జింగ్ పెట్టడం వల్ల అది వేడెక్కే ప్రమాదం ఉంది.

8. నోటిఫికేషన్​లను ఆఫ్ చేయండి
మీరు ఉపయోగించని యాప్స్​ను అన్​ఇన్​స్టాల్ చేయడం మంచిది. నిరంతరం యాప్స్ ఆప్డేట్​లు కోసం నోటిఫికేషన్లు పంపుతాయి. దీంతో ఫోన్ వేడెక్కిపోయే ప్రమాదం ఉంది. అందుకే నోటిఫికేషన్​లను కూడా ఆఫ్ చేయండి. ఇలా చేయడం యాప్​లు బ్యాక్ గ్రాండ్​లో రన్ అవ్వవు. దీంతో ఫోన్ వేడెక్కే ప్రమాదం తగ్గుతుంది.

9. ఫోన్​ను కారులో ఉంచవద్దు
మీ ఫోన్​ను మూసేసిన కారులో ఉంచొద్దు. అలా చేయడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. కారు మూసేసిన తర్వాత దాని లోపలి భాగం వేడెక్కిపోతుంది.

10. జేబులో ఫోన్ వద్దు
సాధారణంగా ఫోన్​ను జేబులో ఉంచుతాం. అయితే ఫోన్​ను జేబులో ఉంచడం వల్ల గాలి తగలక మరింత వేడెక్కే ప్రమాదం ఉంది. వేసవి కాలంలో ఇలా చేయడం వల్ల ఫోన్ మరింత వేడెక్కుతుంది. అందుకే ఫోన్​ను జేబులో కాకుండా బహిరంగ ప్రదేశంలో ఉంచండి.

ముఖ్యమైన ఫైల్స్ పర్మినెంట్​గా డిలీట్ అయ్యాయా? సింపుల్​గా రికవరీ చేసుకోండిలా! - Recover Lost Files On Windows PC

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలా? ఈ 10 సెట్టింగ్స్ మార్చుకోండి! - HOW TO BOOST PHONE BATTERY LIFE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.