ETV Bharat / technology

జూపిటర్‌ చంద్రుడిపై జీవం ఉందా..?- నిగూఢ రహస్యాలు ఛేదించేందుకు రంగంలోకి 'యూరోపా క్లిప్పర్' - JUPITER MOON EUROPA

బృహస్పతి చల్లని జాబిల్లిపై జీవం మనుగడ సాధ్యమేనా?- కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నాసా స్పేస్​క్రాఫ్ట్ ప్రయోగం..

Jupiter Moon Europa
Jupiter Moon Europa (ANI)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 14, 2024, 8:14 PM IST

Jupiter Moon Europa: అనంత విశ్వంలో మానవులకు అంతుచిక్కని ఎన్నో నిగూఢ రహస్యాలున్నాయి. కాలాంతరంలో మనుషులు ఎన్నో రహస్యాలను ఛేదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో భూమిని పోలిన గ్రహాల కోసం శాస్త్రవేత్తలు నిత్యం గాలిస్తున్నారు. భూమిపై కాకుండా వేరే గ్రహంపై కూడా మానవుల మనుగడ సాధ్యమేనా అని తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. భూమిని పోలిన గ్రహాలను గుర్తించినా వాటిపై జీవం ఉందో లేదా కనుగొనేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన నాసా కీలక ప్రకటన చేసింది.

జూపిటర్ చంద్రుడు యూరోపాలో కూడా భూమిలాంటి జీవం ఉండొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో నాసాకు చెందిన స్పేస్​క్రాఫ్ట్ 'యూరోపా క్లిప్పర్' జూపిటర్ చంద్రుడు యూరోపాపైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ వ్యోమనౌకను ఇవాళ రాత్రి 9.36 గంటలకు ప్రయోగించనున్నారు. భూమిపై జీవం సమృద్ధిగా ఉంది. విశ్వంలో మరెక్కడా ఇలాంటి జీవం మనుగడకు సంబంధించిన ఆనవాలు ఇప్పటి వరకూ కన్పించలేదు. అయితే భూమికి సమానమైన జూపిటర్ చంద్రుడు యూరోపాలో జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని నాసా తెలిపింది. ఈ నేపథ్యంలో బృహస్పతి చల్లని జాబిల్లిపై జీవం మనుగడపై శోధించేందుకు నాసా అంతరిక్ష నౌకను ప్రయోగిస్తుంది. ఈ సుదూర గ్రహం చుట్టూ తిరుగుతున్న యూరోపా చంద్రునిపై జీవాన్ని కనుగొనడానికి నాసా ప్రయత్నిస్తుంది.

బృహస్పతి జాబిల్లిపై సముద్రం: భూమిపై ఉన్నట్లుగానే.. జూపిటర్ చంద్రుడు యూరోపాపై కూడా ఉప్పునీటితో కూడిన విస్తారమైన సముద్రం ఉంది. అందువల్ల అక్కడ జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవం మనుగడకు సంబంధించిన వివరాలను కనుగొనేందుకు యూరోపా క్లిప్పర్ మిషన్​ను నాసా ఇంతకుముందుగానే ప్రయోగించాల్సి ఉంది. అయితే అక్టోబర్ 9-10 తేదీలలో ఫ్లోరిడాలో హరికేన్ మిల్టన్ కారణంగా ఈ మిషన్ ఆలస్యం అయింది.

స్పీడ్​ కోసం గ్రావిటీ వినియోగం: క్లిప్పర్, స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ రెండింటినీ నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ ప్యాడ్‌కు సమీపంలో ఉన్న స్పేస్‌ఎక్స్ హ్యాంగర్‌లో భద్రపరిచారు. ఈ వ్యోమనౌక ఫిబ్రవరి 2025లో మార్స్ గ్రహాన్ని చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 2026లో ఈ స్పేస్​క్రాఫ్ట్​ తిరిగి భూమికి చేరుకుంటుంది. ప్రతి గ్రహం గ్రావిటీని వినియోగించుకుని ఇది వేగాన్ని అందుకుంటుంది. ఈ గురుత్వాకర్షణ సహాయంతో 'యూరోపా క్లిప్పర్' 2030 ఏప్రిల్‌లో బృహస్పతిని చేరుకోవడానికి అవసరమైన వేగాన్ని చేరుకుంటుందని నాసా అధికారులు తెలిపారు.

2030లో జూపిటర్​కి యూరోపా క్లిప్పర్: ఏప్రిల్ 14, 2023న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.. జూపిటర్ లూనార్ ఎక్స్‌ప్లోరర్ (జ్యూస్) మిషన్‌ను ఫ్రెంచ్ గయానాలోని యూరప్ స్పేస్‌పోర్ట్ నుంచి బృహస్పతిని దాని మూడు అతిపెద్ద చంద్రులు.. గనిమీడ్, కాలిస్టో, యూరోపాతో పాటు అధ్యయనం చేయడానికి ప్రారంభించింది. జూలై 2030 నాటికి యూరోపా క్లిప్పర్ బృహస్పతిని చేరుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

యూరోపా క్లిప్పర్ స్పేస్​క్రాఫ్ట్ ఏప్రిల్ 2030లో జూపిటర్​ను చేరుకోవడానికి 1.8 బిలియన్ మైళ్లు (2.9 బిలియన్ కిలోమీటర్లు) ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణిస్తున్న సమయంలో ఈ వ్యోమ నౌకకు చెందిన తొమ్మిది సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ యూరోపా చంద్రుని వాతావరణం, ఐస్ క్రస్ట్, దాని కింద సముద్రంపై డేటాను సేకరిస్తాయి. దాదాపు 10-అడుగుల వెడల్పు (3-మీటర్లు) డిష్ ఆకారంలో ఉండే యాంటెన్నా, అనేక చిన్న యాంటెన్నాలు భూమికి డేటాను ప్రసారం చేస్తాయని నాసా తెలిపింది.

వావ్.. ఇది అంతరిక్ష కేంద్రమా..?- డిజైన్​ చూస్తే మతిపోతోందిగా..!

చరిత్ర సృష్టించిన​ స్పేస్​ఎక్స్‌- లాంచ్ ప్యాడ్ వద్దకే రాకెట్ బూస్టర్- వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.