ETV Bharat / technology

సునీతా విలియమ్స్ రెస్క్యూ మిషన్‌ లాంచ్- ఐఎస్​ఎస్​కు బయల్దేరిన స్పేస్​ఎక్స్​ రాకెట్ - SpaceX Crew 9 Mission Launch - SPACEX CREW 9 MISSION LAUNCH

SpaceX Crew 9 Mission Launch: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ రెస్క్యూ మిషన్‌ను శనివారం ప్రారంభించారు. ఎలాన్​ మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్​ సంస్థ క్రూ-9 మిషన్​ను విజయవంతంగా లాంచ్ చేసింది.

SpaceX Crew 9 Mission Launch
SpaceX Crew 9 Mission Launch (NASA & SpaceX)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 29, 2024, 10:51 AM IST

Updated : Sep 29, 2024, 5:34 PM IST

SpaceX Crew 9 Mission Launch: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ రెస్క్యూ మిషన్ క్రూ-9కి నాసా నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. స్పేస్​లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్​ విల్మోర్​​ను తీసుకొచ్చేందుకు రెస్క్యూ మిషన్​ ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ నుంచి ఎలాన్ మస్క్​ సంస్థ స్పేస్​ఎక్స్​కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది. 'ఫాల్కన్​ 9 సక్సెస్​ఫుల్​ లాంచ్​ నేపథ్యంలో నాసా, స్పేస్​ఎక్స్​కి అభినందనలు.' అంటూ నాసా చీఫ్​ బిల్​ నెల్సన్ సామాజిక మాధ్యమం​ ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

ప్రయోగ షెడ్యూల్:

  • కాగా మొదట ఈ మిషన్ షెడ్యూల్​ను సెప్టెంబర్ 26కు ఫిక్స్ చేశారు.
  • ఈ మిషన్ అంతరిక్ష నౌకను కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగించాల్సి ఉండగా అక్కడ తుపాను ప్రభావం కారణంగా ఈ మిషన్ ప్రయోగ తేదీని శనివారానికి మార్చారు.
  • వాస్తవానికి ఫ్లోరిడాలో గత కొన్ని రోజులుగా వాతావరణం బాగోలేదు.
  • హెలెన్​ తుపాను బీభత్సం సృష్టించింది.
  • వరదలు ముంచెత్తడంతో 50కిపైగా మంది ప్రజలు మరణించారు.
  • 10లక్షలకుపైగా మంది ప్రజలు అంధకారంలో జీవిస్తున్నారు.
  • ఈ నేపథ్యంలో స్పేస్​ఎక్స్​ క్రూ 9 లాంచ్​ సాధ్యమవుతుందా? అనే అనుమానాలు రేకెత్తాయి.
  • అయితే అదృష్టవశాత్తు భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10:47 గంటలకు ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
  • అన్ని అనుకున్నట్లుగానే జరిగితే సోమవారం తెల్లవారుజాముకి ఇది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్​(ఐఎస్​ఎస్​)ను చేరుకోవచ్చు.

ఫిబ్రవరిలో విలియమ్స్ భూమిపైకి!:

  • సునీతా విలియమ్స్​తో పాటు తన తోటి వ్యోమగామి​ విల్మోర్​ను వెనక్కి తీసుకొచ్చేందుకు ఈ ఫాల్కన్-9 రాకెట్​లో వ్యోమగాములు నిక్​ హాగ్వే, అలెగ్జాండర్​ గార్బునోవ్​ బయలుదేరారు.
  • నిక్ హాగ్వే​ నాసా ఆస్ట్రొనాట్​ కాగా అలెగ్జాండర్​ గార్బునోవ్ రష్యన్​ కాస్మొనాట్​.
  • ఈ ఫాల్కన్​ 9ని ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​కి వెళ్లి సునీతా విలియమ్స్, బుచ్​ విల్మోర్​ని తీసుకుని ఫిబ్రవరిలో భూమి మీదకు రానుంది.

ఈ ప్రయోగం ఎప్పుడు ప్రారంభమైంది?:

  • బోయింగ్​ రూపొందించిన స్టార్​లైనర్​ స్పేస్​క్రాఫ్ట్​లో ఈ ఏడాది జూన్​లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్​కు వెళ్లారు.
  • బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా 8 రోజుల్లో వెనక్కి రావాల్సిన వ్యోమగాములు ఐఎస్​ఎస్​లో చిక్కుకుపోయారు.
  • దీంతో వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా.. ఎలాన్​ మస్క్​ స్పేస్​ఎక్స్​ సాయం తీసుకుంది.
  • అంతా సవ్యంగానే జరిగితే వీరిద్దరూ ఫిబ్రవరి 2025 నాటికి భూమిపైకి తిరిగి వచ్చేందుకు సాధ్యమవుతుంది.

దేశంలోనే ఫస్ట్ ఎయిర్​ ట్రైన్- ఉచితంగానే ప్రయాణం- ప్రారంభం ఎప్పుడంటే? - India First Air Train

'లవ్'.. ఈ పేరు వినగానే మీ బ్రెయిన్​లో ఏం జరుగుతుందో తెలుసా? - Scientists FOUND How Love Lights Up

Last Updated : Sep 29, 2024, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.