Moto G35 5G Launched: ఇండియన్ మార్కెట్లోకి కేవలం రూ.10వేలకే కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా 'జీ' సిరీస్‌లో మరో మొబైల్‌ను లాంఛ్ చేసింది. 'Moto G35 5G' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హల్లో యూఐ స్కిన్‌తో రన్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ కొత్త 5జీ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
'Moto G35 5G' స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ
- రిఫ్రెష్ రేటు: 120Hz
- టచ్ సాంప్లింగ్ రేటు: 240Hz
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
- బ్యాటరీ: 5,000mAh
- ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3
- 20W వైర్డ్ ఛార్జింగ్
- డాల్బీ అట్మోస్-బ్యాక్డ్ స్టీరియో స్పీకర్‌లు
- IP52 రేటింగ్ లెదర్ ఫినిష్
కెమెరా సెటప్: ఈ కొత్త ఫోన్లో వెనకవైపు 50 ఎంపీ క్వాడ్ పిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సర్, అల్ట్రా వైడ్ యాంగిల్‌తో 8 ఎంపీ సెన్సర్, ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను అమర్చారు.
కనెక్టివిటీ ఫీచర్లు:
- డ్యూయల్ హ్యాండ్ వైఫై
- బ్లూటూత్ 5.0
- 3.5mm ఆడియో జాక్
- యూఎస్‌బీ టైప్- సీ పోర్ట్
వేరియంట్స్: దీన్ని కంపెనీ కేవలం ఒకే ఒక వేరియంట్లో తీసుకొచ్చింది.
4జీబీ+ 128జీబీ
ధర: కంపెనీ ఈ మోటో G35 5G మొబైల్ '4జీబీ+ 128జీబీ' వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించింది.
కలర్ ఆప్షన్స్:
- రెడ్
- లీఫ్ గ్రీన్
- మిడ్‌నైట్ బ్లూ
ఎక్కడ అందుబాటులో ఉంటుంది?: ఈ కొత్త 'Moto G35 5G' మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరొలా రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయొచ్చు.
వారెవ్వా.. గూగుల్ 'విల్లో' వెరీ పవర్ఫుల్ బాస్- దీని స్పీడ్‌కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే!
యాపిల్ యూజర్లకు గుడ్‌న్యూస్- పిచ్చెక్కించే ఫీచర్లతో iOS 18.2 అప్డేట్!
రెడ్మీ ట్రిపుల్ ధమాకా- ఒకేసారి మూడు కిర్రాక్ స్మార్ట్ఫోన్లు లాంఛ్- ధర ఎంతో తెలుసా?