Mercedes-Benz G 580 EV: మార్కెట్లోకి మరో లగ్జరీ కారు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. మెర్సిడెస్-బెంజ్ ఇండియా తన EQ టెక్నాలజీతో 'G 580 EV'ని మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. కంపెనీ ఈ కారును 9 జనవరి 2025న భారత మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 473 కిమీల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. EQ టెక్నాలజీతో ఈ కొత్త 'G 580 EV' అనేది ఐకానిక్ G-క్లాస్ ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ కారు. ఇది క్వాడ్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది.
డిజైన్ అండ్ ఎక్స్టీరియర్: స్టాండర్డ్ ఇంటర్నల్ కంబస్టన్ G-క్లాస్ వెర్షన్‌తో పోలిస్తే దీనిలో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేశారు. దీని ముందు భాగంలో ఫోర్-స్టాట్ గ్రిల్ ఒక క్లోజ్డ్ ప్యానెల్‌తో ఇండియాలోకి వస్తుంది. అయితే గ్లోబల్ మార్కెట్ కస్టమర్లుకు మాత్రం చుట్టూ లైట్లతో EQ-స్టైల్ బ్లాంక్డ్- అవుట్ గ్రిల్ అందుబాటులో ఉంటుంది. ఎ-పిల్లర్‌తో పాటు క్లాడింగ్‌లో మార్పులతో పాటు బంపర్‌లలో కూడా స్వల్ప మార్పులతో ఇది వస్తుంది.
దీని వెనక భాగంలో ఒక రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, వెనక చక్రాల ఆర్జ్లపై ఎయిర్ కర్టెన్ ఉంది. అంతేకాక ఇది స్క్వేర్ స్టోరేజీ బాక్స్‌తో రీప్లేసింగ్ బూట్-మౌంటెడ్ స్పేర్ వీల్ ఉంది. దీనిలో ఛార్జింగ్ కేబుల్స్, టూల్స్‌తో పాటు అనేక ఇతర వస్తువులను ఉంచొచ్చు.
ఇంటీరియర్: దీని ఇంటీరియర్ విషయానికొస్తే ICE వెర్షన్ G-క్లాస్‌తో పోలిస్తే ఇందులో పెద్దగా మార్పు లేదు. దాని డ్యాష్‌బోర్డ్‌లో రెండు 12.3 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేలు ఇన్‌స్టాల్ అయి ఉన్నాయి. ICE మోడల్‌తో పోలిస్తే దీని డిస్‌ప్లేపై EQ-స్పెసిఫిక్ గ్రాఫిక్స్, ట్రెడిషనల్ థ్రీ-లాక్ట్డ్ డిఫెరెన్షియల్ స్విచ్‌లు ఉన్నాయి. 'ట్యాంక్ టర్న్' ఫీచర్, లో రేంజ్ యాక్టివ్ చేసేందుకు వీటిని రీప్లేస్ చేశారు.
పవర్‌ట్రెయిన్: ఈ మెర్సిడెస్ బెంజ్ 'G 580 EV'లో క్వాడ్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఉంది. దీని కారణంగా ఇది 579 bhp శక్తిని, 1,164 Nm అద్భుతమైన టార్క్‌ను అందిస్తుంది. దీని మోటార్.. కారు అండర్ ఫ్లోర్‌లో అమర్చిన 116 kWh బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తిని పొందుతుంది.
ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 473 కిలోమీటర్ల రేంజ్‌ను అందజేస్తుందని మెర్సిడెస్ పేర్కొంది. పనితీరు పరంగా.. మెర్సిడెస్ 4.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇది 'AMG G 63' కంటే 0.4 సెకన్లు తక్కువ. ఇది కాకుండా దీని టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లకు పరిమితం.
ఛార్జింగ్: ఈ ఎలక్ట్రిక్ SUV 11 kW AC ఛార్జింగ్, 200 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆఫ్-రోడ్ సామర్థ్యం విషయానికొస్తే.. G 580 EV డిపార్చర్ యాంగిల్స్‌ను కలిగి ఉందని, ఇది వరుసగా 32 డిగ్రీలు, 30.7 డిగ్రీల అప్రోచ్, 35 డిగ్రీల వరకు సైడ్వార్డ్ స్లోబ్స్తో డ్రైవ్ చేయగలదని కంపెనీ తెలిపింది. SUV బ్రేక్‌ఓవర్ యాంగిల్ 20.3 డిగ్రీలు, దాని ఫోర్డింగ్ డెప్త్ 850 మిమీ.
కంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో వీటికి తిరుగేలేదు.. అమేజ్ vs డిజైర్.. ఈ రెండింటిలో బెస్ట్ ఇదే..!
మీరు మర్చిపోయినా వాట్సాప్ మర్చిపోదుగా.. ఈ ఫీచర్ ద్వారా మీకు గుర్తుచేస్తూనే ఉంటుంది!
స్టైలిష్ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్స్.. బజాజ్ న్యూ చేతక్ ఈవీ వచ్చేస్తోందోచ్..!
న్యూ డిజైన్‌తో రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్- బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!