ETV Bharat / technology

మార్కెట్లో మహీంద్రా థార్ 'రాక్స్'- గంటలోనే 1.76 లక్షలకు పైగా బుకింగ్స్ - Mahindra Thar ROXX Bookings - MAHINDRA THAR ROXX BOOKINGS

Mahindra Thar ROXX Bookings: మార్కెట్లోకి కొత్తగా తీసుకొచ్చిన మహీంద్రా థార్‌ రాక్స్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. ఈ కారు బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభమవ్వగా.. గంటలోపే లక్షన్నరకుపైగా బుకింగ్స్ నమోదు చేసింది.

Mahindra Thar ROXX
Mahindra Thar ROXX (Mahindra)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 4:47 PM IST

Mahindra Thar ROXX Bookings: ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా మార్కెట్లోకి కొత్తగా తీసుకొచ్చిన మహీంద్రా థార్‌ రాక్స్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. గంటలోపే లక్షన్నరకు పైగా బుకింగులు నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. 5 డోర్స్​తో తీసుకొచ్చిన ఈ థార్‌ రాక్స్​ను ఆవిష్కరించినప్పటి నుంచే మార్కెట్లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది.

లాంచ్‌ సమయంలో అక్టోబర్‌ 3 నుంచే బుకింగులు మొదలవుతాయని మహీంద్రా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి వీటి బుకింగ్స్ ప్రక్రియ ప్రారంభించింది. ప్రారంభమైన గంటలోపే 1,76,218 బుకింగ్స్ అందుకుంది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. మహీంద్రా కొత్త థార్‌ రాక్స్​కు ఇంతటి ఆదరణ చూపించిన కస్టమర్లపై సంతోషం వ్యక్తం చేసింది. థార్ రాక్స్ డెలివరీలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని కంపెనీ ప్రకటించింది.

మహీంద్రా థార్‌ రాక్స్‌ వేరియంట్స్:

Mahindra Thar ROXX
Mahindra Thar ROXX (Mahindra)
  • ఈ మహీంద్రా 5డోర్‌ థార్‌ పెట్రోల్‌, డీజిల్‌ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఇంజిన్ పవర్:

  • ఈ కొత్త థార్‌ రాక్స్‌ కారులోని 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 160 బీహెచ్‌పీ శక్తిని, 330ఎన్‌ఎమ్‌ టార్క్‌ని అందిస్తుంది.
  • ఇక 2.2 లీటర్ల mHawk డీజిల్‌ ఇంజిన్‌ 150 బీహెచ్‌పీ శక్తిని, 330ఎమ్‌ఎమ్‌ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
  • ఈ రెండు ఇంజిన్లు ఆటో మెటిక్‌ గేర్‌ బాక్స్‌, సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్​తో వస్తున్నాయి.
Mahindra Thar ROXX
Mahindra Thar ROXX (Mahindra)

దీని ప్రత్యేకత:

  • అత్యంత భద్రతా పరమైన ఫీచర్లతో ఈ థార్‌ రాక్స్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
  • 35 స్టాండెడ్‌ సేఫ్టీ ఫీచర్లతో మహీంద్రా థార్‌ రాక్స్​ను తీసుకొచ్చినట్లు పేర్కొంది.
  • థార్‌ రాక్స్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ సదుపాయం ఉంది.
  • లేన్‌ కీప్‌ అసిస్టెంట్‌, అడాప్టివ్‌ క్రూజ్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్స్‌తో దీన్ని తీసుకొచ్చింది.
  • ఇందులో సిక్స్‌ డబుల్‌ స్టాక్డ్‌ స్లాట్స్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్‌లు ఉన్నాయి.
  • వెనకభాగంలో సీ- షేప్డ్‌ LED టెయిల్‌లైట్స్‌, టెయిల్‌గేట్‌- మౌంటెడ్‌ స్పేర్‌ వీల్‌ అమర్చారు.
  • ఇది 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టంతో వస్తోంది.
  • ఈ మహీంద్రా థార్‌ రాక్స్ యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోకి సపోర్ట్‌ చేస్తుంది.
Mahindra Thar ROXX
Mahindra Thar ROXX (Mahindra)

మహీంద్రా థార్‌ రాక్స్‌ ఇతర ఫీచర్లు:

  • పవర్డ్ సీట్లు
  • రెండు సన్‌రూఫ్ ఆప్షన్లు
  • కనెక్టెడ్‌ కార్ టెక్
  • లెవెల్-2 ADAS
  • అకౌస్టిక్ గ్లాసెస్
  • 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్
  • 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా
Mahindra Thar ROXX
Mahindra Thar ROXX (Mahindra)

మహీంద్రా థార్‌ రాక్స్‌ ధరలు:

Mahindra Thar ROXX
Mahindra Thar ROXX (Mahindra)
  • పెట్రోల్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర: రూ.12.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ప్రారంభం
  • డీజిల్‌ వెర్షన్‌ ధర: రూ.13.99 లక్షల (ఎక్స్‌- షోరూమ్‌) నుంచి ప్రారంభం

యాపిల్ దీపావళి సేల్ వచ్చేసిందోచ్- ఐఫోన్ ప్రియులకు ఇక ఆఫర్ల పండగే..! - Apple Diwali Sale Starts

టీవీఎస్‌ ఐక్యూబ్‌ను దాటేసిన బజాజ్‌ చేతక్‌ సేల్స్- అగ్రస్థానంలో కొనసాగుతున్న ఓలా - Bajaj Chetak Overtake TVS Iqube

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.