ETV Bharat / technology

ఐటెల్ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్లు- తక్కువ ధరలో ఊహకందని ఫీచర్లతో లాంచ్! - ITEL MOBILES LAUNCH

మార్కెట్లోకి ఐటెల్​ మొబైల్స్- ధర, ఫీచర్లు ఇవే..!

Itel S25 and S25 Ultra launched
Itel S25 and S25 Ultra launched (Itel)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 10, 2024, 2:55 PM IST

Itel Mobiles Launch: మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్​ఫోన్లు వచ్చాయి. గాడ్జెట్ తయారీ సంస్థ ఐటెల్ తన 'ఐటెల్ S25', 'ఐటెల్ S25 అల్ట్రా' మొబైల్స్​ను ఫిలిప్పీన్స్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. అండర్ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్ స్కానర్​తో 6.78- అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. ఈ సందర్భంగా వీటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

ఐటెల్ S25, ఐటెల్ S25 అల్ట్రా స్పెసిఫికేషన్స్: ఐటెల్ S25, ఐటెల్ S25 అల్ట్రా రెండూ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు. ఇవి ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతాయి. కంపెనీ 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్టాండర్డ్ మోడల్‌ను తీసుకొచ్చింది. అయితే అల్ట్రా వేరియంట్ అదే పరిమాణం, రిఫ్రెష్ రేట్‌తో కర్వ్డ్​ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్​తో వస్తుంది.

ఐటెల్ S25 చిప్​సెట్​కు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే S25 అల్ట్రా Unisoc T620 చిప్‌సెట్‌తో పాటు 8GB LPDDR4X RAM, 512GB వరకు UFS 2.2 స్టోరేజ్​తో వస్తుంది. ఐటెల్ S25, ఐటెల్ S25 అల్ట్రా రెండూ బ్యాక్ ప్యానెల్​లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం వీటిలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. అయితే ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​ గురించి సమాచారం అందుబాటులో లేదు. ఐటెల్ S25 డస్ట్, స్ప్లాష్ ప్రొటెక్షన్​తో IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. అయితే ఐటెల్ S25 అల్ట్రా కొంచెం మెరుగైన IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. బయోమెట్రిక్ అథెంటికేషన్​ కోసం రెండు ఫోన్‌లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉన్నాయి. అంతేకాక వేరియస్ డివైజస్​ను కంట్రోల్ చేసేందుకు అల్ట్రా మోడల్‌లో ఇన్‌ఫ్రారెడ్ ట్రాన్స్‌మిటర్ ఉన్నట్లు కూడా సమాచారం.

కనెక్టివిటీ ఫీచర్లు:

  • 4G LTE
  • Wi-Fi
  • బ్లూటూత్
  • GPS
  • NFC
  • USB టైప్-C పోర్ట్

కలర్ ఆప్షన్స్:

  • స్టాండర్డ్ మోడల్ ఐటెల్ S25 స్మార్ట్​ఫోన్ బ్రోమో బ్లాక్, మంబో మింట్, సహారా గ్లామ్ కలర్స్​లో మార్కెట్లో అందుబాటులో ఉంది.
  • ఇక ఐటెల్ S25 అల్ట్రా బ్రోమో బ్లాక్, కొమోడో ఓషన్, మెటోర్ టైటానియం కలర్ ఆప్షన్‌లలో తీసుకొచ్చారు.

ధరలు:

  • ఐటెల్ S25 8GB RAM, 128GB స్టోరేజ్‌తో బేస్ మోడల్‌ ధర PHP 5,799 (సుమారు రూ. 8,400) నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఐటెల్ S25 అల్ట్రా ధర PHP 10,999 (సుమారు రూ. 15,900) నుంచి ప్రారంభమవుతుంది.
  • ఐటెల్ S25ని ప్రీ-ఆర్డర్స్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌లోని కస్టమర్‌లు Shopee ద్వారా ఐటెల్ S25ని ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. మరోవైపు ఐటెల్ S25 అల్ట్రా ప్రీ-ఆర్డర్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

వాహన ప్రియులకు గుడ్​న్యూస్- ఓలా ఎలక్ట్రిక్ నుంచి 20 కొత్త ప్రొడక్ట్స్!

చరిత్ర సృష్టించిన మారుతీ డిజైర్- క్రాష్​ టెస్ట్​లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.