iPhone 16 Pro And Pro Max Features : టెక్ దిగ్గజం యాపిల్ ఏటా కొత్త ఐఫోన్ సిరీస్ ఫోన్లు లాంఛ్ చేస్తోంది. ఈ క్రమంలో ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఐఫోన్ 16 సిరీస్‌లో మంచి కెమెరా ఫీచర్స్ ఉండనున్నట్లు సమాచారం. మరెందుకు ఆలస్యం ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో ఉండే ఫీచర్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో కొత్త కెమెరా!
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో కొత్త కెమెరా సెన్సార్ అయిన సోనీ IMX903 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కొత్త సెన్సార్ 48-మెగా పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇది ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్ 15 ప్రో కంటే మరింత క్లారిటీతో ఫొటోలను తీయగలదు. 48- మెగా పిక్సెల్ రిజల్యూషన్‌తో ప్రో మ్యాక్స్ హైరిజల్యూషన్ ఫొటోలు తీయగలదు. అయితే ఈ అప్‌గ్రేడ్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌కు మాత్రమే పరిమితం. ఐఫోన్ 16 ప్రో 48 మెగా పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన సోనీ IMX803 సెన్సార్‌తో వస్తుంది.
కెమెరా అప్‌గ్రేడ్
ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్‌లో అల్ట్రా వైడ్ కెమెరాను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ప్రస్తుత 12 మెగా పిక్సెల్ సెన్సార్‌కు బదులుగా, కొత్త మోడళ్లలో 48 మెగా పిక్సెల్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ఈ అప్‌గ్రేడ్ కారణంగా లో-లైట్ కండిషన్స్‌లో కూడా ఫొటోలు ఫుల్ క్లారిటీతో వస్తాయి. చిన్న సెన్సార్లు తరచుగా లో-లైట్ లో క్లియర్, బ్రైట్ ఫొటోలు క్యాప్చర్ చేయలేవు. 48 మెగా పిక్సెల్ సెన్సార్ మరింత లైట్‌ను గ్రహించడానికి పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఫలితంగా ఏ లైట్ కండిషన్స్‌లోనైనా ఫొటోలు మంచి క్లారిటీతో వస్తాయి.
టెలిఫొటో కెమెరా అప్‌గ్రేడ్?
ఐఫోన్ 16 ప్రోలో టెలిఫొటో కెమెరా 12 మెగా పిక్సెల్ సెన్సార్ 5x ఆప్టికల్ జూమ్ తో యథావిధిగా కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే ఐఫోన్ 16 ప్రో అప్ గ్రేడెడ్ టెలిఫోటో కెమెరాను అందించవచ్చు.
వీడియో క్యాప్చర్ కోసం స్పెషల్ బటన్
ఐఫోన్ 16 ప్రో సిరీస్‌లో బటన్లకు బదులుగా హాప్టిక్ ఫీడ్ బ్యాక్‌తో కెపాసిటివ్ బటన్లను ఆఫర్ చేయవచ్చు. ఈ నో-బటన్ డిజైన్ లుక్‌ను కూడా మెరుగుపరచవచ్చు. ఈ బటన్లు ఒత్తిడిని గుర్తించి, టాప్టిక్ ఇంజిన్ మోటర్ల ద్వారా క్రియేట్ అయిన వైబ్రేషన్ల ద్వారా రియల్ బటన్ నొక్కిన ఫీలింగ్ అందిస్తాయి. వీడియో క్యాప్చర్ కోసం ఒక ప్రత్యేక బటన్ కూడా ఉండే అవకాశముంది.
పెద్ద డిస్ ప్లే!
ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్‌లో 6.3 అంగుళాలు, 6.9 అంగుళాల పెద్ద డిస్ ప్లేలు ఉండొచ్చు. ప్రో మ్యాక్స్ 4,676mAh బ్యాటరీతో రావొచ్చు. ఆర్టిఫ్యాక్ట్స్‌ను తగ్గించడానికి, పిక్చర్ క్వాలిటీని మెరుగుపరచడానికి యాపిల్ అడ్వాన్స్ డ్ యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ టెక్నాలజీని ఇవ్వొచ్చు.
కంటి చూపుతోనే స్క్రీన్‌ను ఆపరేట్ చేసేలా - యాపిల్ నయా ఫీచర్స్! - Apple Accessibility Features