ETV Bharat / technology

ఇన్‌స్టాలో 4 సరికొత్త ఫీచర్లు - DM చేస్తేనే స్టోరీ - షేక్‌ చేస్తే ఫొటో - ఇంకా అవి కూడా! - Instagram Features - INSTAGRAM FEATURES

Latest 4 Instagram Features : ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ 4 సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అవి: రివీల్​, ఫ్రేమ్స్​, యాడ్​ యువర్​ మ్యూజిక్ స్టిక్కర్స్​, కట్​అవుట్​. మరి ఈ ఫీచర్లను ఎలా వాడుకోవాలో తెలుసుకుందామా?

Instagram 4 new Features
Latest Instagram Features : (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 1:43 PM IST

Latest 4 Instagram Features : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్​స్టాగ్రామ్​ 4 సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే కంటెంట్‌ క్రియేటర్ల కోసం సరికొత్త ఎడిట్‌ ఆప్షన్లు తీసుకొచ్చిన ఇన్​స్టాగ్రామ్​, ఇప్పుడు తమ యూజర్ల కోసం మరో 4 కొత్త ఫీచర్లను జోడించింది. ఇవి ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ఫాలోవర్లతో కనెక్ట్‌ అయ్యేందుకు చాలా ఉపయోగపడతాయి. ఇంతకూ ఈ ఫీచర్లు ఏమిటి? ఎలా ఉపయోగించాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రివీల్​
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్​లో స్టోరీ అప్లోడ్​ చేసే ముందు స్టిక్కర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే లొకేషన్‌, క్విజ్‌, హ్యాష్‌ట్యాగ్‌, అవతార్‌ లాంటి పలు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇకపై అందులో ‘REVEAL’ అనే మరో ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేస్తే, ‘Message to reveal’ అనే ఒక మెసేజ్‌ బాక్స్‌ ఓపెన్ అవుతుంది. అందులో మీ స్టేటస్‌కు సంబంధించిన హింట్‌ ఇవ్వవచ్చు. లేదా మీకు నచ్చిన మ్యాటర్​ను టైప్‌ చేసి స్టోరీగా పోస్ట్‌ చేయవచ్చు. అంతే సింపుల్​! ఎవరైనా మీ స్టోరీపై క్లిక్‌ చేస్తే మొదట మీరు పెట్టిన హింట్‌ కనిపిస్తుంది. వారు డీఎం చేస్తేనే మీ స్టోరీ రివీల్‌ అవుతుంది. మీరు పోస్ట్​ చేసిన స్టోరీ ఫాలోవర్లకు ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి, ‘Preview’ ఆప్షన్‌ కూడా ఉంటుంది. అయితే ఇతరులు మీ స్టోరీ చూసేందుకు ప్రతి డీఎంను అప్రూవ్‌ చేయాల్సిన అవసరం లేదు.

మీ స్టోరీకి ఫాలోవర్ల పాట
ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో మ్యూజిక్‌ యాడ్ చేయాలంటే ప్రత్యేకంగా మ్యూజిక్‌ సింబల్‌తో ఒక ఐకాన్‌ ఉంటుంది. దాని సాయంతో ఫొటోలకు, వీడియోలకు నచ్చిన పాటను యాడ్‌ చేసేవాళ్లం కదా. అయితే ఇప్పుడు మీ స్టోరీకి ఇతరులు కూడా సాంగ్‌ యాడ్‌ చేసేలా, ఇన్​స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం మీరు స్టోరీ అప్లోడ్ చేసేముందు, స్క్రీన్‌పై కనిపించే స్టిక్కర్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు ‘Add Yours Music’ అనే ఐకాన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘+ / Add Music’ పేరుతో ఒక మెసేజ్‌ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. దానిపై క్లిక్‌ చేసి, మీకు నచ్చిన పాటను ఎంచుకొని స్టోరీ పోస్ట్‌ చేయవచ్చు. ఫాలోవర్లు ఆ స్టోరీని చూసేటప్పుడు ‘Add Yours’ అనే బటన్‌ కనిపిస్తుంది. దాని సాయంతో వాళ్లకు నచ్చిన పాటను యాడ్‌ చేసుకోవచ్చు.

షేక్‌ చేస్తే ఫొటో
ఇన్​స్టాగ్రామ్​లోని స్టిక్కర్‌ ఐకాన్‌లో ‘Frames’ను సెలెక్ట్ చేసుకుంటే, అది మీ ఫొటో గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. అందులో మీకు నచ్చిన ఫొటోను ఒక ఫ్రేమ్‌గా డిజైన్‌ చేసుకోవచ్చు. అప్పుడు దానికింద సమయం, తేదీ (టైమ్‌ & డేట్‌) ఆటోమెటిక్‌గా అప్‌డేట్‌ అవుతాయి. కావాలనుకుంటే మీరు దానికి క్యాప్షన్‌కూ పెట్టవచ్చు. ఫాలోవర్లు మీ స్టోరీపై క్లిక్‌ చేయగానే ‘shake to reveal’ అనే బటన్‌ కనిపిస్తుంది. వాళ్లు ఫోన్​ను షేక్‌ చేయగానే ఫొటో కనిపిస్తుంది.

కటౌట్లు
మనకు నచ్చిన ఫొటోను లేదా వస్తువును కటౌట్‌ స్టిక్కర్‌గా మార్చుకునేందుకు వాట్సప్‌లో ఒక ఫీచర్​ ఉంది. తాజాగా ఇన్​స్టాగ్రామ్ కూడా అదే ఫీచర్‌ను తమ యూజర్ల కోసం తీసుకువచ్చింది. మీకు స్టోరీ సెలెక్ట్‌ చేయగానే స్క్రీన్‌పై స్టిక్కర్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. దానిలో ‘Cutouts’ని సెలక్ట్ చేసుకుంటే గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. అందులో మీకు నచ్చిన ఫొటో లేదా వీడియోను ఎంచుకుంటే చాలు. ఆటోమేటిక్​గా కటౌట్‌ స్టిక్కర్‌ క్రియేట్‌ అవుతుంది. అది మీకు నచ్చకపోతే ‘Select manually’ అనే ఆప్షన్​ను ఎంచుకుని, మీకు నచ్చిన వస్తువును సెలెక్ట్‌ చేసి తిరిగి స్టికర్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్ - వెంటనే ఆ Apps డిలీట్ చేయండి - లేకుంటే ఇక అంతే! - Android Phone Users Alert

మీ ఫోన్​ కెమెరాను Apps యాక్సెస్​ చేస్తున్నాయా? వెంటనే బ్లాక్ చేసేయండిలా! - App Permissions For Protect Data

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.