How To Use Remote Desktop : నేడు ప్రతి ఒక్కరూ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు. కానీ వాటన్నింటినీ ఒకేసారి మనతో తీసుకువెళ్లలేం కదా. ఇలాంటి సమయంలో ఒక డివైజ్‌తో మరోదానిని యాక్సెస్ చేయగలిగితే ఎలా ఉంటుంది? సూపర్‌గా ఉంటుంది కదా! ఇందుకు ఉపయోగపడేదే 'రిమోట్ డెస్క్‌టాప్' ఫీచర్.
'రిమోట్ డెస్క్‌టాప్' అంటే మన కంప్యూటర్ నుంచి లేదా ఆండ్రాయిడ్/ ఐవోఎస్ ఫోన్ల నుంచి సుదూరంలోని మరో కంప్యూటర్‌ను యాక్సెస్ చేసుకోగలిగే ఒక సాంకేతిక మార్గం. ఈ ఆప్షన్ విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌ల్లో అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో విండోస్ 11 ప్రో, విండోస్ 10 ప్రో వెర్షన్లను సపోర్ట్ చేసే డివైజ్‌ల్లో రిమోట్ డెస్క్ టాప్ ఆప్షన్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఫస్ట్ స్టెప్
- మనం సుదూరంగా ఉన్న మరో కంప్యూటర్‌ను యాక్సెస్ చేయాలని అనుకుంటే, తొలుత మన కంప్యూటర్‌లో విండోస్ 10/ 11 ప్రో ఎడిషన్ ఉండేలా చూసుకోవాలి. అవతలి వైపున ఉన్న రిమోట్ కంప్యూటర్‌లో విండోస్ ప్రో లేదా విండోస్ హోం వెర్షన్ ఏది ఉన్నా ఫర్వాలేదు.
ఒక వేళ ఆ రిమోట్ కంప్యూటర్ వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసేదైనా ఏ సమస్యా ఉండదు. - రిమోట్ డెస్క్‌టాప్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసేందుకు, ముందుగా ‘Start’ బటన్‌ను నొక్కాలి. తరువాత ‘Settings’ను ఓపెన్ చేయాలి. System అనే విభాగంలో About అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, మీ విండోస్ వెర్షన్ వివరాలు కనిపిస్తాయి. అందులో విండోస్ 10 ప్రో లేదా విండోస్ 11 ప్రో ఉందో, లేదో చూడాలి. ఒక వేళ లేకపోతే, విండోస్ 10 ప్రో లేదా విండోస్ 11 ప్రోనకు అప్‌గ్రేడ్ కావాలి.
- సదరు కంప్యూటర్‌కు కచ్చితంగా ఓ 'పేరు' పెట్టుకోవాలి.
- ఇది పూర్తైన తరువాత, మళ్లీ కంప్యూటర్‌లోని Start బటన్‌పై క్లిక్ చేసి, Settingsను ఓపెన్ చేయాలి.
- అక్కడ మీకు Remote Desktop అని కనిపిస్తుంది. దాన్ని మీరు ‘On’ చేసి, తరువాత ‘Confirm’పై క్లిక్ చేయాలి. అంతే సింపుల్!
సెకండ్ స్టెప్
- మీరు ఏ కంప్యూటర్‌ను అయితే యాక్సెస్ చేయాలని అనుకుంటున్నారో, దానికి కూడా ఒక పేరు పెట్టాలి.
- మీ విండోస్ కంప్యూటర్ టాస్క్‌బార్‌పై ఉండే సెర్చ్ బాక్స్‌లో Remote Desktop Connection అని టైప్ చేయాలి. అది ఓపెన్ అయ్యాక మీరు రిమోట్‌గా కనెక్ట్ చేయాలని భావిస్తున్న కంప్యూటర్ పేరును టైప్ చేయాలి. ఆ తర్వాత Connect అనే ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. అంతే సింపుల్! ఇకపై మీకు చాలా సుదూరంలో ఉన్న కంప్యూటర్‌ను కూడా మీ డివైజ్తోనే యాక్సెస్ చేయవచ్చు. దానిని కంట్రోల్ కూడా చేయవచ్చు.
ఫోన్ ద్వారా కంప్యూటర్‌ను కంట్రోల్ చేయండిలా!
Remote Desktop app లాంటి యాప్స్‌ను ఉపయోగించి, మీ ఫోన్ ద్వారా కంప్యూటర్‌ను యాక్సెస్ చేయవచ్చు లేదా కంట్రోల్ చేయవచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ ప్లే, మ్యాక్ యాప్‌స్టోర్, మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి Remote Desktop app డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని మీ డివైజ్‌లో ఇన్స్టాల్ చేసుకోవాలి. తరువాత మీ కంప్యూటర్‌కు ఒక పేరు పెట్టాలి. తరువాత దానికి ఒక PIN సెట్ చేసుకోవాలి. అంతే సింపుల్!
ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి Remote Desktop app ఓపెన్ చేయాలి. మీరు యాక్సెస్ చేయాలని అనుకుంటున్న కంప్యూటర్ పేరు, పిన్ ఎంటర్ చేయండి. అంతే సింపుల్! సదరు కంప్యూటర్ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది.
లాక్డౌన్ మోడ్‌తో మీ ఫోన్ మరింత సేఫ్- ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా? - Lock Down Mode Android