How To Recover Permanently Deleted Files From PC : మీ కంప్యూటర్లోని కీలకమైన ఫైల్స్ పర్మినెంట్‌గా డిలీట్ అయిపోయాయా? వాటిని ఎలా రికవరీ చేయాలో తెలియడం లేదా? డోంట్ వర్రీ. విండోస్ పీసీలో పర్మినెంట్‌గా డిలీట్ అయిన ఫైల్స్‌ను చాలా సులువుగా రికవరీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
విండోస్ పీసీలో శాశ్వతంగా డిలీట్ అయిన ఫైల్స్‌ను రికవరీ చేయడానికి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో Disk Drill Data Recovery Software ఒకటి. దీనితో పర్మినెంట్‌గా డిలీట్ అయిన డేటాను కూడా చాలా ఈజీగా రికవరీ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం.
- ముందుగా మీరు Drill Data Recovery Software డౌన్లోడ్ చేసుకోవాలి.
- తరువాత ఈ సాఫ్ట్‌వేర్‌ను మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి, లాంఛ్ చేయాలి.
- తరువాత ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైజ్‌లైన SSD/ హార్డ్ డిస్క్/ మెమొరీ కార్డ్‌లను మీ కంప్యూటర్‌కు ఇన్సర్ట్ చేయాలి.
- ఇప్పుడు డ్రిల్ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేయాలి.
- మీకు అవసరమైన స్టోరేజ్ డ్రైవ్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
- సదరు స్టోరేజ్ డ్రైవ్‌పై క్లిక్ చేసి Search for lost dataపై క్లిక్ చేయాలి.
- అప్పుడు ఆ సాఫ్ట్వేర్ స్టోరేజ్ డ్రైవ్‌ను స్కాన్ చేసి, పర్మినెంట్‌గా డిలీట్ అయిన ఫైల్స్‌ను వెతుకుతుంది.
- ఇలా పర్మినెంట్‌గా డిలీట్ చేసిన ఫైల్స్ అన్నింటినీ రికవరీ చేయడానికి 3 నుంచి 4 గంటల వరకు పడుతుంది.
- స్కానింగ్ కంప్లీట్ అయిన తరువాత శాశ్వితంగా డిలీట్ అయిన ఫైల్స్ అన్నింటినీ రికవరీ చేసేస్తుంది.
- మీరు Review found itemsపై క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది.
- ఈ విండోలో చాలా ఫైల్స్ కనిపిస్తాయి.
- అలాగే ఆల్ ఫైల్స్, పిక్చర్స్, వీడియో, ఆడియో, డాక్యుమెంట్స్, ఆర్కైవ్స్, అదర్స్ అనే ఫిల్టర్స్ కనిపిస్తాయి.
- వీటిలో మీకు అవసరమైన దానిని ఎంచుకోవాలి.
- తరువాత Found Files ఫోల్డర్ ఓపెన్ చేయాలి. అక్కడ మీకు కావాల్సిన ఫైల్స్ కనిపిస్తాయి.
- ఒక వేళ దానిలో మీకు కావాల్సిన ఫైల్ లేకపోతే Reconstructed అనే ఫోల్డర్లో చెక్ చేయాలి.
- Found files ఫోల్డర్లో చాలా ఫైల్స్ ఉంటాయి. వాటిలో డిలీట్ అయిన ఫైల్స్‌ను మీరు చూడవచ్చు.
- ఈ ఫైల్ క్వాలిటీగా ఉందా, లేదా అని చూడడానికి పక్కనే ఉన్న eye ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ఆ ఫైల్ ప్రివ్యూ మీకు కనిపిస్తుంది.
- ఫైల్ బాగానే ఉంటే, దానిని సెలెక్ట్ చేసుకుని, Recover బటన్‌పై క్లిక్ చేయాలి.
- మీకు ఇష్టమైన లొకేషన్‌ను (డ్రైవ్-D) ఎంచుకుని, ఓకే చేయాలి. అంతే సింపుల్.
- పర్మినెంట్‌గా డిలీట్ అయిన ఫైల్ వెంటనే రికవరీ అయిపోతుంది.
- రికవరీ అయిన తరువాత మీకు ఒక మెసేజ్ వస్తుంది.
- వెంటనే Show recovered data పై క్లిక్ చేస్తే, పర్మినెంట్‌గా డిలీట్ అయిన ఫైల్ మీకు లభిస్తుంది.
- ఈ విధంగా మీ విండోస్ పీసీలో శాశ్వతంగా డిలీట్ అయిన ఫైల్‌ను కూడా చాలా ఈజీగా రికవరీ చేసుకోవచ్చు.