Increase Cloth Life Span With Washing Machine : వాషింగ్ మెషీన్‌ను వాడటానికి ముందు మనం తెలుసుకోవాల్సింది వివిధ రకాల వస్త్రాల స్వభావం గురించి. ఎందుకంటే ఒక్కో క్లాత్ ఒక్కో రకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. కొన్ని వస్త్రాలు రఫ్ అండ్ టఫ్‌గా ఉంటాయి. ఇంకొన్ని చాలా డెలికేట్‌గా ఉంటాయి. ఈ తేడాను అర్థం చేసుకొని మనం వాటిని వాషింగ్ మెషీన్‌లో వేయాల్సి ఉంటుంది. ఆయా వస్త్రాల స్వభావానికి అనుగుణంగా వాషింగ్ మెషీన్ సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. అన్ని రకాల దుస్తులకు ఒకే రకమైన ఉతుకుడు ఫార్ములాను వాడితే దెబ్బతినేది మీ దుస్తులే అని గుర్తుంచుకోండి.
మెత్తటి పదార్థం అదే
దుస్తులు ఉతికేకొద్దీ వాషింగ్ మెషీన్‌లోని ఫిల్టర్లలో మెత్తటి పదార్థం పేరుకుపోతుంటుంది. ఆ మెత్తటి పదార్థంలో మన దుస్తుల్లోని దారపు పోగులు కూడా ఉంటాయి. అంటే వాషింగ్ మెషీన్ వేగంగా ఉతికే ప్రక్రియను నిర్వహించే క్రమంలో మన దుస్తుల్లోని కొన్ని దారపు పోగులు బయటికి వచ్చేస్తుంటాయి. ప్రత్యేకించి వదులుగా ఉన్న దారపు పోగులు మన దుస్తుల నుంచి విడిపోతాయి. అందుకే సున్నితమైన క్లాత్‌లను వాషింగ్ మెషీన్ ఉతుకుకు దూరంగా ఉంచడం మంచిది. ఇక మనం వాషింగ్ మెషీన్ ఫిల్టర్లను క్లీన్ చేసే సమయంలో వాటిలో చేరిన వేస్ట్ మెటీరియల్‌ను తీసేయాలి. అయితే ఈ ప్రక్రియను యూజర్ మాన్యువల్ ప్రకారం చేయడం బెటర్.
ఫ్రంట్ లోడర్ వర్సెస్ టాప్ లోడర్
మన దుస్తుల క్వాలిటీని కాపాడుకోవాలంటే చాలా అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో వాషింగ్ మెషీన్ రకం, వాషింగ్ సైకిల్, డిటర్జెంట్లు, టెంపరేచర్స్, టైమ్, క్లాత్ స్వభావం అనేవి చాలా ముఖ్యమైనవి. ఇక వాషింగ్ మెషీన్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టాప్ లోడర్ రకం. మరొకటి ఫ్రంట్ లోడర్ రకం. ఈ రెండింటి పనితీరు డిఫరెంట్‌గా ఉంటుంది. టాప్ లోడర్‌లోని మెషీన్‌లోని బకెట్, మనం వేసే దుస్తులతో నిలువునా రొటేట్ అవుతూ వాటిలోకి డిటర్జెంట్, నీళ్లను పంపింగ్ చేసి క్లీన్ చేస్తుంది.
ఫ్రంట్ లోడర్‌లోని బకెట్, మనం వేసే దుస్తులతో అడ్డంగా రొటేట్ అవుతూ దుస్తులను శుభ్రం చేస్తుంది. టాప్ లోడర్‌తో పోలిస్తే ఫ్రంట్ లోడర్ తక్కువ నీటిని వాడుకుంటుంది. ఎందుకంటే ఇది గురుత్వాకర్షణ సిద్ధాంతం ఆధారంగా రొటేట్ అవుతుంది. ఈ లెక్కల ప్రకారం టాప్ లోడింగ్ మెషీన్లు వాడేవారు దుస్తులను ఉతికే క్రమంలో ఎక్కువ అలర్ట్‌గా ఉండాలి. వాషింగ్ సైకిల్, డిటర్జెంట్లు, టెంపరేచర్స్, వస్త్రం స్వభావాలను దృష్టిలో ఉంచుకొని మెషీన్‌లో దుస్తులు వేయాలి.
టెంపరేచర్ రేంజ్ సెట్టింగ్స్ ఇలా
దుస్తులపై సాధారణ మరకలు పడితే 'లో టెంపరేచర్' ఆప్షన్లు సరిపోతాయి. మొండి మరకలు ఉన్నప్పుడు, వైద్య సిబ్బంది దుస్తులు, కెమికల్ ఫ్యాక్టరీల్లో పనిచేసే వారి దుస్తులను ఉతికేందుకు 'హై టెంపరేచర్' ఆప్షన్‌ను వాడుకోవచ్చు. వీటిలో ఏదైనా పొరపాటు జరిగితే సున్నితమైన వస్త్రాల క్లీనింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
దుస్తుల్లోని దారపు పోగులు వదులుగా తయారయ్యే రిస్క్ ఎదురుకావచ్చు. నూలు వంటి సున్నితమైన క్లాత్స్‌ను 'హై టెంపరేచర్' సెట్టింగ్‌లో పెట్టి ఉతికితే అవి ఎక్కడికక్కడ కుచించుకుపోయి రూపురేఖలను కోల్పోతాయి. మొత్తం క్లాత్ క్వాలిటీ దెబ్బతింటుంది. హై టెంపరేచర్ ఎఫెక్టుతో కొన్ని సందర్భాల్లో సున్నితమైన క్లాత్‌లలో రంధ్రాలు కూడా ఏర్పడుతుంటాయి. కాటన్ క్లాత్స్ చాలా టఫ్‌గా ఉంటాయి. వాషింగ్ మెషీన్స్ సెట్టింగ్స్ కొంత అటూ ఇటూ అయినా ఇవి తట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వామ్మో డిటర్జెంట్స్
వాషింగ్ మెషీన్లలో డిటర్జెంట్ లేదా సబ్బు సెక్షన్ ఉంటుంది. దుస్తులపై ఉండే మరకలను తొలగించడంలో ప్రధాన పాత్ర వీటిదే. మనం వాడే కొన్ని రకాల బ్లీచింగ్‌లు, వైట్నర్ ఏజెంట్లలో కఠినమైన రసాయన సమ్మేళనాలు ఉంటాయి. వీటితో దుస్తులను ఉతికేటప్పుడు వాష్ సైకిల్స్‌పై ఫోకస్ చేయాలి. వాష్ సైకిల్స్ అతిగా పెడితే దుస్తుల క్వాలిటీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఉన్ని, పట్టు రకాలకు చెందిన దుస్తులలోని దారపు పోగుల అమరికను డిటర్జెంట్లలోని రసాయన సమ్మేళనాలు చెల్లాచెదురు చేసే అవకాశం ఉంటుంది.
మంచి స్మార్ట్‌వాచ్ కొనాలా? రూ.2,500 బడ్జెట్లోని టాప్-10 ఆప్షన్స్ ఇవే!
హెల్త్ ట్రాకింగ్ కోసం మంచి స్మార్ట్‌వాచ్ కొనాలా? రూ.5000 బడ్జెట్లోని టాప్-6 ఆప్షన్స్ ఇవే!