How To Delete Your Truecaller Account : మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్ నుంచి ఫోన్లు వస్తే చాలా చిరాకుగా ఉంటుంది. మనకు వచ్చే కాల్స్‌లో చాలా వరకు స్పామ్ కాల్స్ ఉంటాయి. అందుకే వీటిని ముందుగా గుర్తించడానికి చాలా మంది ట్రూకాలర్ యాప్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. ట్రూకాలర్ యాప్‌ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే, మనకు ఎవరి నుంచి కాల్స్ వస్తున్నాయో సులువుగా తెలిసిపోతుంది. ఫలానా బ్యాంక్ నుంచి వస్తున్న స్పామ్ కాల్ అని, లేదంటే ఫ్రాడ్ కాల్ అని అది చూపిస్తుంది. దీని వల్ల చాలా వరకు స్పామ్ కాల్స్ బాధ నుంచి తప్పించుకోవచ్చు.
ట్రూకాలర్ యాప్ ఉపయోగం ఎలా ఉన్నా, దీని వల్ల ప్రైవసీ దెబ్బతినే అవకాశం ఉంది. పైగా ఇది ఇండియాకు చెందిన కంపెనీ కాదని, మన డేటాను ఇతర దేశాలకు, సంస్థలకు ఇస్తుందనే ప్రచారం ఉంది. అందుకే చాలా మంది ట్రూకాలర్ యాప్‌ను డిలీట్ చేసి, ట్రూకాలర్ సర్వర్ నుంచి తమ పేర్లను పూర్తిగా తీసివేయాలని అనుకుంటూ ఉంటారు. అందుకే ట్రూకాలర్ యాప్‌ని సేఫ్‌గా ఎలా డిలీట్ చేయాలి? ట్రూకాలర్ నుంచి తమ మొబైల్ నంబర్‌ను ఎలా ఎలా తీసివేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రూకాలర్ అకౌంట్‌ను డిలీట్ చేయండిలా!
- ముందుగా మీ మొబైల్లో ఉన్న ట్రూకాలర్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
- స్క్రీన్ పై భాగంలో ఉండే మూడు చుక్కలను లేదా గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి.
- తర్వాత Settings మీద క్లిక్ చేసి అక్కడ Privacy Centerలోకి వెళ్లాలి.
- అక్కడ Deactivate బటన్‌పై క్లిక్ చేయాలి.
- కన్ఫర్మేషన్ ప్రాంప్ట్‌లో YES పై నొక్కి కన్ఫార్మ్ చేయండి.
పైన చెప్పిన విధంగా చేస్తే మీ ట్రూకాలర్ అకౌంట్ డిలీట్ అవుతుంది.
ట్రూకాలర్ నుంచి మీ మొబైల్ నంబర్‌ను తొలగించండిలా!
- వెబ్ బ్రౌజర్లో https://www.truecaller.com/unlisting లింక్‌ను ఓపెన్ చేయండి.
- మీ మొబైల్ నంబర్‌తో పాటు మీ దేశం కోడ్‌ను కూడా నమోదు చేయండి.
- అక్కడ Un-list Phone Numberపై క్లిక్ చేయాలి.
ఇలా చేసి ట్రూకాలర్ నుంచి మీ నంబర్‌ను శాశ్వతంగా తొలగించుకోవచ్చు.
ఇది గుర్తుపెట్టుకోండి!
మీరు ట్రూకాలర్ యాప్‌ను డిలీట్ చేసినా, గతంలో మీ మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ మొత్తం ట్రూకాలర్ సర్వర్లలో ఉంటుంది. వాటిని డిలీట్ చేయడం కుదరదు. కానీ మీరు కొత్తగా యాడ్ చేసుకునే నంబర్ల వివరాలు మాత్రం ట్రూకాలర్‌లో నమోదు కావు. ఒకవేళ మీరు ట్రూకాలర్ యాప్‌ని డీయాక్టివేట్ చేయాలని అనుకుంటే, ట్రూకాలర్ యాప్‌ని ఓపెన్ చేసి అక్కడ పీపుల్స్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి aboutపై క్లిక్ చేయాలి. అక్కడ 'డీయాక్టివేట్ అకౌంట్' అనే దానిపై క్లిక్ చేస్తే, మీ ట్రూకాలర్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది.
ఓపెన్ AI మరో సంచలనం- మ్యాటర్ ఇస్తే వీడియో రెడీ- ఎలా పనిచేస్తుందంటే?
ఐఫోన్ యూజర్లకు అలర్ట్ - iOSలోకి తొలిసారి వైరస్ ఎంట్రీ! మీ బ్యాంక్ అకౌంట్ జర భద్రం!