ETV Bharat / technology

ఫోన్లో ఈ రెండు సెట్టింగ్స్​ మార్చితే చాలు- మీ బ్యాటరీ లైఫ్ ఇక బేఫికర్! - HOW TO BOOST PHONE BATTERY LIFE

మీ స్మార్ట్​ ఫోన్​ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతోంది? ఈ సెట్టింగ్స్​ మార్చితే ఇక బేఫికర్!

How To Boost Phone Battery Life
How To Boost Phone Battery Life (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 2:44 PM IST

How To Boost Phone Battery Life : మీ ఫోన్​ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతోందా? ఫోన్​ను పదేపదే ఛార్జ్ చేయాల్సి వస్తోందా? అయితే వెంటనే మీరు ఈ సమస్యలను ఫిక్స్​ చేయాల్సిందే. లేదంటే మీ ఫోన్​ బ్యాటరీ లైఫ్ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించడం కోసం ఫోన్లో కొన్ని సెట్టింగ్స్​ మారిస్తే బ్యాటరీ ఎక్కువ సమయం వస్తుందని నిపుణుల మాట. మరి ఆ సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బ్రైట్​నెస్
ఫోన్​ను మీరు ఎంత బ్రైట్​నెస్​తో వాడుతున్నారు, ఎంత త్వరగా బ్యాటరీ డ్రెయిన్ అవుతోంది అనే దానికి సంబంధం ఉంది. అందుకే మీ ఫోన్​ బ్రైట్​నెస్​ను​ సౌకర్యంగా ఉండే స్థాయికి తగ్గించండి. తద్వారా మీరు బ్యాటరీని సేవ్​ చేయొచ్చు. దీని కోసం ఆటోమెటిక్ బ్రైట్​నెస్​ స్మార్ట్​ సెట్టింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ సెట్టింగ్- మీరు ఉన్న పరిస్థితికి అనుగుణంగా బ్రైట్​నెస్​ను అడ్జస్ట్​ చేస్తుంది. మీరు ఉన్న ప్రాంతంలో ఎంత లైట్​ ఉంది అనే దానికి అనుగుణంగా బ్రైట్​నెస్​ను తగ్గిస్తుంది లేదా పెంచుతుంది.

ఈ సెట్టింగ్​ ఆన్​ చేసుకోవాలంటే ముందుగా సెట్టింగ్స్​లోకి వెళ్లి--> యాక్సెసిబిలిటీ ట్యాబ్​ను క్లిక్​ చేయాలి. అనంతరం--> డిస్​ప్లే &టెక్స్ట్​ సైజ్​పై క్లిక్​ చేయాలి. ఆ తర్వాత ఆటో-బ్రైట్​నెస్​ను సెలెక్ట్​ చేయాలి.

2. లొకేషన్ సెట్టింగ్స్
స్మార్ట్​ ఫోన్​ వాడుతున్నవారు ఎప్పుడూ 'లొకేషన్ సర్విసెస్​ సెట్టింగ్స్​' విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర యాప్​లకు లొకేషన్​ యాక్సెస్​ ఇస్తే బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అయిపోవడం సహా వ్యక్తిగత డేటా చౌర్యం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నావిగేషన్, వెదర్ యాప్​ల సెట్టింగ్స్​ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇవే కాకుండా కొన్న యాప్​లు మీ లొకేషన్​ను​ యాక్సెస్​ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తాయి. అలాంటి వాటికి లొకేషన్​ పర్మిషన్​ ఇస్తే సర్విసెస్​ క్వాలిటీ పెరగకపోగా, మీ విలువైన డేటాను థర్డ్​ పార్టీ ప్రకటన కర్తలకు(అడ్వర్టైసింగ్ ఏజెన్సీలు) అమ్మే ప్రమాదముంది. అందుకోసమే యాప్​లకు ఈ సర్వీసెస్​ పర్మిషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఫోన్​లో లొకేషన్​ సర్వీసెస్​ను కంప్లీట్​గా నిలిపివేయొచ్చు లేదా సెట్టింగ్​లలో మార్పులు చేయొచ్చు. తద్వారా యాప్​​ వాడేతున్నప్పుడు మాత్రమే అవి మీ లొకేషన్ ఉపయోగించుకుంటాయి.

ఈ సెట్టింగ్​ ఆన్​ చేసుకోవాలంటే ముందుగా సెట్టింగ్స్​లోకి వెళ్లి --> ప్రైవసీ & సెక్యూరిటీపై క్లిక్ చేయాలి--> అనంతరం లొకేషన్ సర్వీసెస్​పై క్లిక్​ చేసి ఆ ఆప్షన్​ను ఆఫ్​ చేయాలి.

'వివో X200 ప్రో మినీ'కి పోటీగా ఒప్పో నయా ఫోన్!- రిలీజ్ ఎప్పుడంటే?

ఐఫోన్ యూజర్లకు గుడ్​న్యూస్- మీ వద్ద ఈ మోడల్ ఫోన్ ఉందా?- అయితే ఫ్రీ సర్వీస్​ ఆఫర్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.