Block Apps From Using Phone Camera : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరుగుతోంది. హై స్పీడ్ డేటా అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. మరోవైపు టెక్నాలజీని ఉపయోగించుకుని అనేక మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్నారు. అందుకే మన వ్యక్తిగత సమాచారంతో పాటు, బ్యాంకింగ్‌కు సంబంధించిన వివరాలు కాపాడుకోవటం చాలా ముఖ్యం.
మనం స్మార్ట్‌ఫోన్స్‌లో యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కెమెరా, మైక్రో ఫోన్, లొకేషన్‌ను యాక్సెస్ చేసేందుకు అనుమతులు అడుగుతాయి. అయితే కొన్ని యాప్‌లు అవసరం లేకున్నా ఈ వివరాలను అడుగుతున్నాయి. దీని వల్ల మన వ్యక్తిగత డేటా, ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే యాప్‌ను ఇన్స్టాల్ చేసే సమయంలో, అవసరం లేని పర్మిషన్స్ ఇవ్వకూడదు. అప్పుడే మన సమాచారం గోప్యంగా ఉంటుంది.
ఒక వేళ మీరు వాడుతున్న యాప్స్ మీకు తెలియకుండానే, ఫోన్ కెమెరా, మైక్, లొకేషన్లను వాడుతూ ఉంటే, వెంటనే వాటిని బ్లాక్ చేయాలి. లేదా పర్మిషన్ సెట్టింగ్స్ మార్చుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Allow Only While Using the app : ఏదైనా యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కెమెరా, మైక్రో ఫోన్, లోకేషన్ వివరాలు అడుగుతాయి. అప్పుడు ఎల్లప్పుడూ వినియోగించుకొనేందుకు బదులుగా, యాప్ ఓపెన్ చేసిన సమయంలో మాత్రమే ఉపయోగించుకునే విధంగా అనుమతి ఇవ్వాలి.
Ask Every Time : స్మార్ట్ ఫోన్లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారీ లోకేషన్, కెమెరా, మైక్రో ఫోన్ అనుమతి అడిగే విధంగా Ask Every Time అనే ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. ఇలా తాత్కాలికంగా అనుమతి ఇవ్వడం వల్ల, మీ వ్యక్తిగత సమాచారం మోసగాళ్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
Don't allow : స్మార్ట్‌ఫోన్‌లో లోకేషన్, కెమెరా, మైక్రో ఫోన్ అనుమతిని పూర్తిగా నిరాకరించడానికి Don't allow ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అయితే కొన్ని యాప్‌లకు ఈ అనుమతులు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి వాటికి పైన ఇచ్చిన ఆప్షన్లను ఉపయోగించుకుంటే మంచిది.
యాప్ పర్మిషన్స్ ఎలా మార్చుకోవాలి?
How To Change App Permissions : ఇప్పటికే మీరు పలు యాప్‌లకు కెమెరా, మైక్, లొకేషన్ యాక్సెస్ ఇచ్చి ఉంటే,
- యాప్ పర్మిషన్స్ మార్చుకోవడానికి ఫోన్లోని Settings యాప్‌ను ఓపెన్ చేయండి.
- Apps సెక్షన్లోకి వెళ్లి, మీరు పర్మిషన్స్ మార్చాలని అనుకుంటున్న యాప్‌పై క్లిక్ చేయాలి.
- Permission ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అందులో కెమెరా, లోకేషన్, కాంటాక్ట్, మైక్రో ఫోన్ లాంటివన్నీ కనిపిస్తాయి.
- మీరు మార్చాలని అనుకుంటున్న పర్మిషన్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే మీకు 'Allow while using the app', 'Don’t allow' and 'Ask Every Time' అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.
- వాటిలో మీకు అవసరైన ఆప్షన్‌ను ఎంచుకోండి. అంతే సింపుల్!
యాప్ టైప్‌ను బట్టి పర్మిషన్స్ ఎలా మార్చుకోవాలి?
How To Change Permissions Based On App Type : ఇలా ఒక్కొక్క యాప్‌నకు కాకుండా అన్నింటికి కలిపి ఒకేసారి పర్మిషన్స్ మార్చాలంటే,
- ఫోన్ సెట్టింగ్స్ యాప్ వెళ్లాలి.
- ప్రైవసీ లేదా సెక్యూరిటీ & ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- పర్మిషన్ మేనేజర్‌పై లేదా యాప్ పర్మిషన్స్‌పై క్లిక్ చేయాలి.
- దీనితో అన్ని రకాల పర్మిషన్స్ కనిపిస్తాయి.
- అందులో కెమెరా, లోకేషన్, కాంటాక్ట్, మైక్రో ఫోన్ ఆప్షన్లలో మీకు అవసరమైన దానిని ఎంచుకోవాలి.
- వాటిపై క్లిక్ చేశాక 'Allow while using the app', 'Don’t allow' and 'Ask Every Time' ఆప్షన్లు కనిపిస్తాయి.
- ఈ పర్మిషన్లలో మీకు కావాల్సిన దానిని ఎంచుకోవాలి. అంతే సింపుల్!