ETV Bharat / technology

పండగ వేళ హీరో మోటోకార్ప్​కు షాక్- రిటైల్ సేల్స్​లో నంబర్​ వన్​గా హోండా - HONDA OVERTAKES HERO MOTOCORP

Honda Overtakes Hero Motocorp: ఈ పండగ సీజన్​లో హీరో మోటోకార్ప్​కు హోండా గట్టి షాక్ ఇచ్చింది. సెప్టెంబర్​లో నమోదైన రిటైల్ సేల్స్​లో హీరోను దాటేసి అగ్రస్థానంలో నిలిచింది.

Honda Overtakes Hero Motocorp
Honda Overtakes Hero Motocorp (Honda)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 8, 2024, 3:00 PM IST

Honda Overtakes Hero Motocorp: ప్రముఖ టూ- వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా హీరో మోటోకార్ప్‌ను దాటేసింది. సెప్టెంబర్‌ నెలలో రికార్డ్ అయిన రిటైల్‌ విక్రయాల్లో హీరో కంటే మెరుగైన సేల్స్​తో దేశంలోనే అత్యధిక టూ- వీలర్ వాహనాలు విక్రయించిన కంపెనీగా అవతరించింది. రిటైల్‌ సేల్స్‌కు సంబంధించి ఫాడా (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

27.73 శాతం మార్కెట్‌ వాటాతో నంబర్​ వన్​గా:

ఫాడా గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్‌ నెలలో హోండా 62,537 యూనిట్ల సేల్స్​తో 27.73 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది.

హీరో మోటోకార్ప్‌ 22.54 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది.

గతేడాదితో పోలిస్తే రెండు కంపెనీల సేల్స్ తగ్గడం గమనార్హం.

టీవీఎస్‌ మోటార్‌, బజాజ్‌ ఆటో, సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా టాప్‌-5 స్థానాల్లో ఉన్నాయి.

ఈ ఐదు సంస్థలు కలిపి 86.57 మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి.

హోల్‌సేల్‌ విక్రయాల పరంగా ఇప్పటికీ హీరో మోటోకార్ప్‌ నంబర్​ వన్​గా కొనసాగుతోంది.

వాహన్‌ వెబ్‌సైట్‌ ఆధారంగా రిటైల్‌ నంబర్లు రూపొందిస్తుంటారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2.96 లక్షల యూనిట్లను హీరో హోల్‌ సేల్‌గా విక్రయించగా.. హోండా మాత్రం 2.92 లక్షల యూనిట్ల సేల్స్​తో రెండో స్థానంలో నిలిచింది.

వాహన ప్రియులకు గుడ్​న్యూస్- త్వరలో మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా స్పెషల్ ఎడిషన్

ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఢమాల్- కమెడియన్​పై భవిశ్ ఘాటు వ్యాఖ్యలే కారణమా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.